Telangana

News August 28, 2024

కమనీయం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News August 28, 2024

నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

image

నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 11 గేట్లు ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,26, 796 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకుగాను ప్రస్తుతం 590.00 అడుగులుగా ఉంది. 

News August 28, 2024

వరంగల్ రాజముద్ర వివాదంపై ఎక్స్‌లో స్పందించిన KTR

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంపై కేటీఆర్ ‘X’లో స్పందించారు. ‘ఇది అధికారిక నిర్ణయమా? లేక అనాధికారిక నిర్ణయమా?.. అసలు ఏం జరుగుతుందో మీకైనా తెలుసా?’ అంటూ తెలంగాణ సీఎస్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. తెలంగాణ రాజముద్రను ఆమోదించక ముందే ఇలా ఫ్లెక్సీలో ముద్రించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News August 28, 2024

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు

image

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ విజృంభిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ ఫీవర్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది.

News August 28, 2024

రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్..!

image

బేగంబజార్‌లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థలాలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది. కొన్నిచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త వాటిని నిర్మిస్తుండటం గమనార్హం. ఇటీవల ఫీల్ఖానాలోని 101 గజాల స్థలం రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ నిలిచిందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు.

News August 28, 2024

HYD: త్వరలో ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు

image

టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి మరో రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే తొలి దశలో 3,035 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి ఆమోదం తెలిపారన్నారు.

News August 28, 2024

HYD: సాంకేతిక సేవలతో నిర్మాణరంగ వ్యర్థాల తరలింపు

image

నిర్మాణరంగ వ్యర్థాల తరలింపునకు సాంకేతిక సేవలను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్‌లో సంప్రదిస్తే నిర్మాణ రంగ వ్యర్థాలు సేకరించే ప్రక్రియను అమల్లోకి తెచ్చింది. నిర్ణీత రుసుం చెల్లిస్తే ఎక్కడ నుంచైనా నిర్మాణరంగ వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది సేకరించనున్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1159తో పాటు వాట్సాప్ నంబర్ 9100927073లో సంప్రదించవచ్చు.

News August 28, 2024

సంగారెడ్డి: ALERT.. కాన్ఫరెన్స్‌లో పెట్టి కాజేశారు

image

ఎల్‌ఐసీ పాలసీ పూర్తయినందున డబ్బులు అకౌంట్‌లో వేస్తామని న్యాల్కల్(M) బసంతపూర్‌‌కి చెందిన వెంకట్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్‌ చెప్పాలని కోరగా వెంటనే ఇచ్చాడు. అందులో డబ్బు లేదని, కనీసం రూ.3 వేలు ఉండాలని సైబర్‌ నేరగాడు చెప్పాడు. డబ్బులు వేస్తామని, వేరే వారి నంబర్ ఇవ్వాలని అడగ్గా అతడు సుదర్శన్‌రెడ్డికి కాన్ఫరెన్స్‌ కలిపాడు. అతడిని మాటల్లో పెట్టి ఖాతా నుంచి రూ.99 వేలు కొట్టేశాడు.

News August 28, 2024

HYD: సాంకేతిక సేవలతో నిర్మాణరంగ వ్యర్థాల తరలింపు

image

నిర్మాణరంగ వ్యర్థాల తరలింపునకు సాంకేతిక సేవలను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్‌లో సంప్రదిస్తే నిర్మాణ రంగ వ్యర్థాలు సేకరించే ప్రక్రియను అమల్లోకి తెచ్చింది. నిర్ణీత రుసుం చెల్లిస్తే ఎక్కడ నుంచైనా నిర్మాణరంగ వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది సేకరించనున్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1159తో పాటు వాట్సాప్ నంబర్ 9100927073లో సంప్రదించవచ్చు.

News August 28, 2024

ఖైరతాబాద్: గణేశ్ ఉత్సవాల సమయంలో అదనపు ట్రిప్పులు

image

ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌లో డిమాండ్ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో అదనపు మెట్రోరైళ్లు నడిపిస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి సందర్శనకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మెట్రోరైళ్లు నడిపిస్తామని వెల్లడించారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రోరైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.