India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇందుర్తిలో శనివారం 41.7℃ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట 40.6, గంగాధర 40.5, రేణికుంట 39.7, కొత్తపల్లి 39.7, బూర్గుపల్లి 39.3, కరీంనగర్ 39.2, వెంకేపల్లి 39.2, కొత్తగట్టు 39.1, ఆసిఫ్‌నగర్ 38.9, తనుగుల 38.8, వీణవంక 38.8, మల్యాల 38.6, గుండి 38.6, చిగురుమామిడి 38.5, ఏదులగట్టేపల్లి 38.4, ఆర్నకొండ 38.4, చింతకుంట 37.8, బోర్నపల్లి 37.7, వెదురుగట్టు 37.6, దుర్శేడ్ 37.1, గట్టుదుద్దెనపల్లిలో 37.1℃.
గొంతులో పచ్చి చేప ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. స్థానికుల వివరాలిలా.. బాలానగర్ మండలం మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్(45) మోతిఘణపూర్ గ్రామ శివారులోని చెరువులో శనివారం స్నేహితులతో కలిసి చేపలు పట్టాడు. పట్టిన వాటిలో ఒక చేపను తినగా అది గొంతులోకి పోయి ఇరుక్కుంది. సహచరులు దాన్ని తీసేలోపే అతనికి ఊపిరాడక మృతి చెందాడు.
ఏసుక్రీస్తు పునరుత్థానానికి గుర్తుగా జరుపుకునే ఈస్టర్ వేడుకలకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. గుడ్ ఫ్రైడే తర్వాత మూడో రోజైన ఆదివారం ఈ పండుగ జరగనుండగా.. వేడుకలకు చర్చిలు, మందిరాలను ముస్తాబుచేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించగా.. ఆదివారం ప్రార్థనలకు పెద్దసంఖ్యలో హాజరయ్యే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
రంజాన్ పండుగ అంటే మొదట గుర్తుకొచ్చేది ముస్లింల ఉపవాసం.. సాయంత్రమైతే కులమతాలకతీతంగా అందరినీ నోరూరించే హలీమ్! ఇక రంజాన్ పండుగ రోజు ముస్లింలు బంధుమిత్రులను ఆహ్వానించి సేమియాతో నోరు తీపి చేయడం ఆనవాయితీ. అయితే, మార్కెట్‌లో రకరకాల కంపెనీల సేమియాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొందరు సొంతంగా ఇళ్లలో సేమియా తయారుచేయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈనెలంతా ముస్లింల ఇళ్లలో సందడి కనిపిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నిజాంపేటలో 42.1డిగ్రీలు నమోదైంది. అత్యవసరమయితేనే బయటకెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బకు గురైనా, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నా వెంటనే ఆస్పతులకు వెళ్లాలని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. ఆస్పత్రుల్లో మందులు, ORSప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఖమ్మం జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీ ఉంటుందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి 4,11,283కార్డులకు గాను లబ్ధిదారులకు అవసరమైన 7,280.271మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్‌షాపులకు చేరవేశామని పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో బియ్యం తీసుకోవాలని ఆయన సూచించారు.
HYD నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ ఏసీ పుష్పక్ బస్సులు నేరుగా ఎయిర్‌పోర్ట్ ప్రవేశం మార్గం వరకు వెళ్లనున్నాయి. శనివారం నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. HYD నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిచే 49 ఏసీ బస్సులు అరైవల్స్‌తో పాటు డిపార్చర్స్ వద్ద కూడా ఆగనున్నాయి.
HYD నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ ఏసీ పుష్పక్ బస్సులు నేరుగా ఎయిర్‌పోర్ట్ ప్రవేశం మార్గం వరకు వెళ్లనున్నాయి. శనివారం నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. HYD నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిచే 49 ఏసీ బస్సులు అరైవల్స్‌తో పాటు డిపార్చర్స్ వద్ద కూడా ఆగనున్నాయి.
వేసవి ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నగర, పురపాలికలకు వివిధ పనులకు సంబంధించి రూ.2.72 ఓట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటి సరఫరాకు, పైప్ లైన్‌లో మరమ్మత్తులకు ఈ నిధులు వినియోగించుకోవాలి. నిజామాబాద్ రూ.96.30 లక్షలు, బాన్సువాడ 38.12, ఎల్లారెడ్డి 35.36, బోధన్ 52.44, కామారెడ్డి 28.31, ఆర్మూర్18.24, బాన్సువాడ 4.19 వచ్చాయి.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ భర్తీకి శనివారం రాత పరీక్ష నిర్వహించారు. ఒక పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకున్న 84 మందిలో 71 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షను పర్యవేక్షించిన డిప్యూటీ సూపరిండెంట్ బి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిభ ఆధారంగా అర్హత ఉన్న వ్యక్తిని ఎంపిక చేస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.