India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలమూరు యూనివర్సిటీలో ఆదివారం టైక్వాండో ఉమ్మడి జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 14 నియోజకవర్గాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. టైక్వాండో మాస్టర్ బాబూలాల్, PD శ్రీనివాసులు మాట్లాడుతూ.. సబ్ జూనియర్స్,సీనియర్స్ ఒక క్యాడర్ పద్ధతిలో మహిళలకు, పురుషులకు వేరువేరుగా పోటీలు నిర్వహించామన్నారు. విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశామన్నారు.

కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ, వీఎల్ఈ)ల కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పాలకుర్తికి చెందిన మాసంపల్లి నాగయ్య, సహాయ కార్యదర్శిగా రాపోలు లక్ష్మణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని కామన్ సర్వీస్ సెంటర్ కార్యాలయంలో వీఎల్ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు.

రఘునాథపాలెం: హర్యాతండ వద్ద మే 28న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం ACP రమణమూర్తి వివరాలు వెల్లడించారు. బాబాజీతండాకు చెందిన నేరస్తుడు బోడ ప్రవీణ్ HYDలో వైద్యుడిగా పని చేస్తూ కేరళకు చెందిన యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరి అక్రమ సంబంధానికి భార్య పిల్లలు అడ్డు వస్తున్నారన్న నేపంతో భార్య పిల్లలను హత్య చేసి, రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించాడని పేర్కొన్నారు.

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. శని ఆదివారం సెలవులు కావడంతో మార్కెట్ బంద్ అయింది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం అవుతాయి.

NLG: పట్టణ ప్రజలు కలుషిత తాగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్న సాగర్ వాటర్‌లో పురుగులు, చెత్త చెదారం వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పానగల్ వద్ద మిషన్ భగీరథ నీళ్లను ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

పది ఫలితాలు గర్వకారణమని, కన్న తండ్రి లెక్క ఆనందంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశమని, ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వరుసగా ఐదు సార్లు అగ్రగామిగా నిలిచి సిద్దిపేట పేరు నిలబెట్టారని అభినందించారు.

జగిత్యాల జిల్లా మల్యాలలో పీర్ల పండుగలో విషాదం చోటుచేసుకుంది. యువకుడు బేకం లక్ష్మణ్(25) పులి వేషంలో నృత్యం చేశాడు. మధ్యాహ్నం ఇంటికెళ్లి ఛాతిలో నొప్పి వస్తుంది అని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. మార్గమధ్యంలో యువకుడు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, బాబు, పాపం ఉన్నారు.

నల్లబెల్లి మండలం నారక్క పేట గ్రామానికి చెందిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఇటివల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శ్రీనివాస్ చిత్రపటానిక ఎస్సై బ్యాచ్‌మేట్స్ (2014 SI బ్యాచ్) ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.

కానిస్టేబుల్, హోంగార్డ్ సస్పెండ్ అయిన ఘటన బీబీపేటలో చోటుచేసుకుంది. బీబీపేట ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ నవీన్, హోంగార్డు రవి కలిసి 3 రోజుల క్రితం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వ్యక్తితో కలిసి వాహనంలో మద్యం తాగి కారుతో పోలీస్ స్టేషన్ గేటును ఢీకొన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి ఏఎస్ఐ ప్రభాకర్‌ను బదిలీ చేసి కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు.

అనంతగిరికి పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో వికారాబాద్ జిల్లాకు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం ప్రఖ్యాత శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ ఉండడంతో టూరిస్టులతో సందడిగా మారింది.
Sorry, no posts matched your criteria.