Telangana

News July 11, 2024

మెదక్: స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

మెదక్ స్టేడియంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. మెదక్ ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ శ్రీనివాసరావులతో కలిసి క్షేత్ర పర్యటనలో భాగంగా స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలను చేశారు. సీసీ టీవీల పర్యవేక్షణ, సెక్యూరిటీ పకడ్బందీగా నిర్వహించాలని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అధికారులకు సూచించారు.

News July 11, 2024

సంగారెడ్డి: జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

image

సంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గంజాయి, మాదకద్రవ్యాలు తరలిస్తున్నారా పరిశీలించారు. జిల్లాలో ఎవరైనా మాదకద్రవ్యాలు, గంజాయి తరలిస్తే 87126 56777 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

News July 11, 2024

తాడ్వాయి: నేను టీచర్ అవుతా: తులసి

image

తాను బాగా చదువుకొని టీచర్ అవుతానని తక్కల్లగూడెం గుత్తిగూడెం ఆదివాసీ బిడ్డ పూనెం తులసి అంటోంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన పాత్రను నేచురల్ చేసినట్లు చెప్పింది. “గూడెంలోని జీవనశైలి, కుటుంబ పోషణ” విధానంపై పాత్ర చేశానని, తనతోపాటు గూడెంలోని పిల్లలందరూ చదువుకోవాలన్న తులసి కోరిక మేరకు ఇటీవల మంత్రి సీతక్కస్కూల్ భవనం నిర్మించి ప్రారంభించారు. తులసి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

News July 11, 2024

బొంరాస్‌పేట: అండగా ఉంటాను, అధైర్య పడకు: కేటీఆర్

image

బొంరాస్ పేట మండలం BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర బాయి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైదరాబాదులోని తన నివాసానికి పిలిపించుకుని పరామర్శించారు. అధైర్య పడకండి, నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మండల నాయకులు ఉన్నారు.

News July 11, 2024

దేవరకద్ర: బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతి పత్రం

image

మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొంది తొలిసారి దేవరకద్ర‌లో కృతజ్ఞత సభకు విచ్చేసిన డీకే అరుణకి కొండ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా స్వాగతం పలికి శాలువ కప్పి సన్మానం చేశారు. అనంతరం దేవరకద్ర‌లోని వ్యాపారస్తులు అందరు కలిసి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గని నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

పొతంగల్‌లో పేకాటాడుతున్న 9 మంది అరెస్ట్

image

పోతంగల్ మండలం జల్లాపల్లి గ్రామంలో పోలీసులు పేకాటాడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారికి అందిన సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని రూ.70,350 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గ్రామాల్లో ఎవరైనా పేకాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 11, 2024

రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా: భట్టి

image

ఖమ్మం: రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌‌లో భట్టి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైన రైతు భరోసా పథకాన్ని ప్రజాక్షేత్రంలో రైతుల అభిప్రాయాలకు, అనుగుణంగా పకడ్బందీగా అమలు చేసి తీరుతుందన్నారు. 

News July 11, 2024

ఆదిలాబాద్: ఫీజు చెల్లింపు గడువు మరోసారి పొడిగింపు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూలై 12 వరకు గడువు ఉండగా ఈనెల 31 వరకు పొడగించినట్లు తెలిపారు. మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లలో ఫీజు చెల్లించవచ్చన్నారు. PG రెండో సంవత్సర పరీక్షలు జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు, PG మొదటి సంవత్సరం పరీక్షలు ఆగస్టు 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News July 11, 2024

రేవంత్‌‌తో సమానంగా భట్టి ఫొటోను పెట్టాలి: మోత్కుపల్లి

image

ఆంధ్రప్రదేశ్‌లో సీఎంతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫొటోను అన్ని ఆఫీసులలో ఉండాలని అక్కడి సీఎం జీవో రిలీజ్ చేయడం హర్షించదగ్గ విషయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా దళిత ఉపముఖ్యమంత్రి అయిన భట్టి వికమార్క ఫొటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News July 11, 2024

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలం: మంత్రి పొన్నం

image

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలమయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదని ఆరోపించారు. స్థానిక సంస్థలకు 73, 74 రాజ్యాంగం ద్వారా వచ్చే 15వ ఫైనాన్స్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి కిషన్ రెడ్డి తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌కి భంగం కలిగించేలా కిషన్ మాటలు ఉన్నాయని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని పొన్నం అన్నారు.