Telangana

News August 28, 2024

సంగారెడ్డి: ‘సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

image

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో పద్మజా రాణికి సమర్పించారు. టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

News August 28, 2024

ఖైరతాబాద్: గణేశ్ ఉత్సవాల సమయంలో అదనపు ట్రిప్పులు

image

ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌లో డిమాండ్ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో అదనపు మెట్రోరైళ్లు నడిపిస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి సందర్శనకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మెట్రోరైళ్లు నడిపిస్తామని వెల్లడించారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రోరైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు. 

News August 28, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 242 గంజాయి కేసులు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువత గంజాయికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 242 కేసులు నమోదు కాగా, 398 మందిని అరెస్ట్ చేశారు. 1,056.64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News August 28, 2024

ములుగు: గవర్నర్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటారు: సీతక్క

image

ములుగు జిల్లాలోని ఏదైనా ఓ గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకుంటానని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ తెలిపారని సీతక్క అన్నారు. గవర్నర్ పర్యటన ప్రశాంతంగా ముగిసిందన్నారు. సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్‌గా నియామకమైన అనంతరం మొదటిసారి ములుగు జిల్లాకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ పర్యటనలో సహకరించిన ప్రతి ఒక్కరికి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

News August 28, 2024

నల్గొండ: పెన్షన్ రూ.2వేలు ఇస్తూ రూ.2,016 రాస్తున్నారు

image

ప్రతినెలా రూ.2,016లు. పక్కన సంతకాలు. అసలు ఈ ఫోటో ఏంటని అనుకుంటున్నారా. వృద్ధాప్య పింఛన్ ఇస్తూ ప్రతినెలా రాస్తున్న పుస్తకం ఇది. విషయం ఏంటంటే బుక్‌లోనేమో రూ.2,016 ఇస్తున్నామని రాస్తున్నారు. కానీ పేద వృద్ధులకు ఇచ్చేది మాత్రం రూ.2 వేలే. ఇది త్రిపురారం మండలంలోని పరిస్థితి. రూ.16 ఇవ్వమని ప్రశ్నిస్తే చిల్లర లేవు అంటూ ప్రతినెలా పేదల సొమ్ము మిగుల్చుకుంటున్నారు. మీ దగ్గర ఎలా ఉంది..?

News August 28, 2024

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.!

image

KNR-MDK-NZB- ADB పట్టభద్రుల MLCగా పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత MLC జీవన్ రెడ్డి పదవీకాలం మార్చి 2025లో ముగియనుండడంతో పాటు సెప్టెంబరు 30 నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం కానుండగా కాంగ్రెస్, BRS, BJPలో ఆశావహులుగా ఉన్నవారు ఓటర్లను కలుస్తూ కొత్తగా ఓటర్లను చేర్పించేందుకు ఆయా ప్రాంతాల్లో తమ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

News August 28, 2024

HYD: మహిళల బొమ్మలతో మగవారికి పరీక్ష.. ఫలితం

image

యువతులు, మహిళలను మగవారు ఏ విధంగా చూస్తున్నారన్న అంశంపై ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు బొమ్మలతో ప్రయోగాలు చేశారు. కుర్తాలు, చీరలను ఉపయోగించి కొన్ని బొమ్మలు, జీన్స్, షర్టులతో మరికొన్ని బొమ్మలను వేలమందికి పంపిణీ చేశారు. ముఖ కవళికలను తెలుసుకునేందుకే ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ని ఉపయోగించారు. అయితే, ఎక్కువ మంది యువకులు అనుచితంగా లైంగిక శరీర భాగాలను చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడైంది.

News August 28, 2024

ఈనెల 31న గోదావరిఖనికి డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈనెల 31న గోదావరిఖని రానున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం సింగరేణి సంస్థకు సంబంధించిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్‌తో పాటు సింగరేణి బొగ్గు గనులు సందర్శించనున్నారు. అదేవిధంగా పట్టణ చౌరస్తాలో సభ జరగనుంది. ఇందుకోసం సింగరేణి GMలలిత్ కుమార్‌తో పాటు నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, గోదావరిఖని ACPమడత రమేశ్ సభా స్థలం ఏర్పాట్లు పరిశీస్తున్నారు.

News August 28, 2024

MLG: గ్రేట్.. వైకల్యాన్ని లెక్కచేయక..

image

అన్ని అవయవాలు ఉన్న వారే చిన్న చిన్న సమస్యలకే కుమిలిపోతూ వ్యసనాలకు బానిస అవుతున్నారు. అలాంటిది మిర్యాలగూడకి చెందిన కంచర్ల శ్రీనివాస పవన్‌కు పుట్టుకతోనే కుడి చేయి మణికట్టు వరకు మాత్రమే ఉంది. దివ్యాంగులకు నిర్వహించే పారా బ్యాడ్మింటన్ పోటీల గురించి తెలుసుకొని అందులో రాణించాడు. రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

News August 28, 2024

HYD: మహిళల బొమ్మలతో మగవారికి పరీక్ష.. ఫలితం

image

యువతులు, మహిళలను మగవారు ఏ విధంగా చూస్తున్నారన్న అంశంపై ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు బొమ్మలతో ప్రయోగాలు చేశారు. కుర్తాలు, చీరలను ఉపయోగించి కొన్ని బొమ్మలు, జీన్స్, షర్టులతో మరికొన్ని బొమ్మలను వేలమందికి పంపిణీ చేశారు. ముఖ కవళికలను తెలుసుకునేందుకే ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ని ఉపయోగించారు. అయితే, ఎక్కువ మంది యువకులు అనుచితంగా లైంగిక శరీర భాగాలను చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడైంది.