Telangana

News March 29, 2024

HYD: రేపే KTR పాదయాత్ర..!

image

పార్లమెంట్ ఎన్నికలపై BRS అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. సభలు, ర్యాలీలతో పాటు ఈసారి పాదయాత్ర చేసేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30వ తేదీ శనివారం సా.5 గంటలకు KTR పాదయాత్ర HYD అంబర్‌పేట్‌లో జరగనుందని MLA కాలేరు వెంకటేశ్ తెలిపారు. BRS శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని MLA పిలుపునిచ్చారు. సత్తా చాటేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని అన్నారు.

News March 29, 2024

NZB: కుక్క కాటుతో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్కకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. నందిపేట లక్కంపల్లి సెజ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్(36)ను ఈ నెల 10న విధుల్లో ఉన్న సమయంలో కుక్క కరిచింది. నందిపేట PHCలో టీకాలు ఇప్పించుకున్నాడు. అనంతరం తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం ఇవాళ మృతి చెందాడు.

News March 29, 2024

HYD: రేపే KTR పాదయాత్ర..!

image

పార్లమెంట్ ఎన్నికలపై BRS అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. సభలు, ర్యాలీలతో పాటు ఈసారి పాదయాత్ర చేసేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30వ తేదీ శనివారం సా.5 గంటలకు KTR పాదయాత్ర HYD అంబర్‌పేట్‌లో జరగనుందని MLA కాలేరు వెంకటేశ్ తెలిపారు. BRS శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని MLA పిలుపునిచ్చారు. సత్తా చాటేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని అన్నారు.

News March 29, 2024

NLG: పార్లమెంట్ ఎన్నికల్లో ఇక హోరాహోరీగా పోరు!

image

ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభించాలని ఆయా పార్టీల అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో గ్రామాలు, మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది.

News March 29, 2024

KTDM: ‘నేను పార్టీ మారడం లేదు’

image

మహబూబాబాద్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారడం లేదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా. నాపై నమ్మకంతోనే మళ్లీ మహబూబాబాద్ ఎంపీ సీటు కేసీఆర్ ఇచ్చారు. బీఆర్ఎస్ గెలిచే ఎంపీ స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి’ అని చెప్పారు.

News March 29, 2024

మార్చిలోనే మండుతున్న ఖమ్మం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం మధిర, బోనకల్, ఎర్రుపాలెం, సత్తుపల్లిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఖమ్మం, కొణిజర్ల, భద్రాచలం, చర్ల, బూర్గంపాడులో 39, పెనుబల్లిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపానికి మధ్యాహ్నం రోడ్లని నిర్మానుష్యంగా మారాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News March 29, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

image

మెదక్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతోపాటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి ఉన్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు.

News March 29, 2024

ఎంపీగా గెలిస్తే మహబూబ్‌నగర్ రూపురేఖలు మారుస్తా: వంశీచంద్ రెడ్డి

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే మహబూబ్‌నగర్ లోక్‌సభ రూపురేఖలు మారుస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. నేడు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం మొత్తం ప్రజలతో ముడిపడి ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి అండతో మహహబూబ్‌నగర్ అభివృద్ధి చేసి చూపిస్తామని, ఆరు గ్యారంటీలను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు.

News March 29, 2024

ఖమ్మం: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

image

ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి రూరల్ మండలం పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఖమ్మం లోకసభ ఎన్నికల కౌంటింగ్ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏడు సెగ్మెంట్లకు కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూంలు, కేంద్రీకృత రిసెప్సన్ కేంద్రం ఏర్పాటుపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.

News March 29, 2024

కాసిపేట: అల్యూమినియం దొంగతనం.. ఫిర్యాదు

image

కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ శివారులోని ట్రాన్స్ఫార్మర్ నుంచి 23 కిలోల అల్యూమినియం దొంగతనానికి గురైందని ఏఈ స్వర్ణలత ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 23 కిలోల అల్యూమినియం అపహరించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

error: Content is protected !!