India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని వేపూర్‌కు చెందిన CRPF జవాన్ విష్ణు (26) మంగళవారం అర్ధరాత్రి కోల్‌కతా సరిహద్దుల్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోదరుడు శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో ఉండగా జరిగిన కాల్పుల్లో మృతి చెందాడని అక్కడి హెడ్ క్వార్టర్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
✔నేడు పాలమూరుకు కిషన్ రెడ్డి రాక ✔అచ్చంపేట:నేటి నుంచి రెండు రోజులు వ్యవసాయ మార్కెట్ బంద్ ✔గద్వాల్, వనపర్తి: పలు గ్రామాలలో కరెంట్ కట్ ✔పలు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల పర్యటన ✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు ✔నవాబుపేట: నేటి నుంచి మలక్ షా బాబా ఉర్సు ప్రారంభం ✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(శుక్ర)-6:35,సహర్(శని):4:50 ✔త్రాగు నీరు, ఉపాధి హామీ పనులపై అధికారుల ఫోకస్
కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసిందని HYDలోని అధికారులు తెలిపారు. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుందన్నారు. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం తమ వెబ్‌సైట్ https://kvsangathan. nic. in/ను సందర్శించాలని వారు కోరారు.

మండలంలో జరిగిన <<12933675>>భారీ చోరీ<<>> కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రూ.13.50 లక్షల నగదును రికవరీ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మద్నూర్ మండలంలో నివాసం ఉండే మహాజన్ బాలాజీ ఇంట్లో ఈ నెల 26న రాత్రి చోరీ జరిగింది. బీరువాలో దాచిన 25 తులాల బంగారం, నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
వచ్చే నెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిశోర్ తెలిపారు. HYD ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే, ఈ సారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందన్నారు.

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో ఈ నెల 25న మేడిశెట్టి రమను హత్య చేసిన నిందితుడు బోగు ప్రకాశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల శివారులో గల లక్ష్మీగార్డెన్ వద్ద నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి బైక్, కొడవలి, ఫోను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఓ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన యువకుడిని కొత్తకోట పోలీసులు జైలుకు పంపించారు. SI మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాటవెల్లికి చెందిన ఓ బాలికను వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాగా బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఉపాధి కూలీలకు కేంద్రం దినసరి కూలిని పెంచింది. పెంచిన కూలిని APR 1 నుంచే చెల్లించనున్నారు. గతేడాది APR 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు రూ. 272గా చెల్లిస్తుండగా.. తాజాగా మరో రూ.28 పెంచింది. దీంతో రూ. 300లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4 లక్షల జాబ్కార్డుల కూలీలకు లబ్ధి కలగనుంది. వ్యవసాయేతర పనులకు వెళితే రూ.500 వరకు చెల్లిస్తుండడంతో.. కూలి రేట్లు పెరిగినా కూలీలు అసంతృప్తితోనే ఉన్నారు.
Sorry, no posts matched your criteria.