Telangana

News July 28, 2024

SRPT: పండుగకు తీసుకెళ్లి భూమి పట్టా చేయించుకున్నాడు

image

పండుగకు తీసుకెళ్లి తమ భూమిని
అక్రమంగా మేనల్లుడు నాగరాజు పట్టా
చేయించుకున్నారని, మద్దిరాలకు చెందిన గురువోజు సోమాచారి వెంకటమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవరావుకు శనివారం ఫిర్యాదు చేశారు. తమ భూమిని ఎలాగైనా తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

News July 28, 2024

కిషన్ రెడ్డి HYDకు ఎన్ని నిధులు తెచ్చారు: పొన్నం

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు తీసుకురాని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రులుగా కొనసాగే అర్హత ఉందా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వరుసగా రెండోసారి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి HYD అభివృద్ధికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. బండి సంజయ్ తన నియోజకర్గానికి నిధులు తీసుకురావడంతో విఫలమయ్యారని ఆరోపించారు. పొన్నం వ్యాఖ్యలపై మీ కామెంట్.

News July 28, 2024

కిషన్ రెడ్డి HYDకు ఎన్ని నిధులు తెచ్చారు: పొన్నం

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు తీసుకురాని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రులుగా కొనసాగే అర్హత ఉందా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వరుసగా రెండోసారి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి HYD అభివృద్ధికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. బండి సంజయ్ తన నియోజకర్గానికి నిధులు తీసుకురావడంతో విఫలమయ్యారని ఆరోపించారు. పొన్నం వ్యాఖ్యలపై మీ కామెంట్.

News July 28, 2024

MBNR: వడ్డీ లేని రుణం పేరుతో రూ.89 వేలు స్వాహా

image

సున్నా వడ్డీతో వ్యాపారానికి రూ.10 లక్షలు రుణం ఇస్తామని ఆశ చూపి రూ.89వేలు కొట్టేసిన ఘటన అమరచింతలో చోటుచేసుకుంది. SI సురేశ్ వివరాల ప్రకారం.. అమరచింత వాసి వెంకటరమణ ఫేస్‌బుక్‌లో “సున్నా వడ్డీతో వ్యాపారానికి రూ.10 లక్షలు కావాలా?” ప్రకటన చూసి, వివరాలు నమోదు చెయ్యగా.. GST, రుణ ప్రాసెస్, ఇతర ఖర్చుల పేరుతో రూ.89 వేల వరకు కట్టించుకున్నారు. తర్వాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

News July 28, 2024

పటాన్‌చెరు: ప్రేమ పెళ్లి.. 6 నెలలకే వివాహిత సూసైడ్

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న 6నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్పూర్‌లో జరిగింది. APలోని గుంటూరుకు చెందిన హర్షిత, ఎడ్లపాడు చెందిన మహేశ్ పేరెంట్స్ సమక్షంలో ఫిబ్రవరి 23న పెళ్లి చేశారు. అమీన్పూర్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటుండగా మహేశ్‌కు ఉద్యోగం లేకపోవడంతో హర్షిత తండ్రి నెలకు రూ.30వేలు పంపాడు. ఇటీవల IT జాబ్ వచ్చినా మహేశ్ వెళ్లకపోగా ఆస్తిలో వాటా కోసం భార్యను వేధించగా మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది.

News July 28, 2024

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి తుమ్మల

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో కలియ తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల మర్యాదతో మెలిగి మంచి చికిత్స అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

News July 28, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం ఈ విధంగా ఉంది. ఇన్ ఫ్లో: 39,338 క్యూసెక్కులు ఔట్ ఫ్లో: 6,282 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం 509 అడుగులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 130.43 టీఎంసీలు

News July 28, 2024

ఎల్లారెడ్డి: ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

image

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించే ఉద్యోగి విఠల్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ రాజు తెలిపారు. మద్యం తాగి పాఠశాలకు వచ్చి విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. సస్పెండైన వ్యక్తి అనుమతి లేకుండా ఎల్లారెడ్డి మండల కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు.

News July 28, 2024

భాగ్యలక్ష్మి అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి

image

మహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ ఉత్సవాలు సాగుతున్నాయి. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మ వారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

News July 28, 2024

శుభకార్యాలకు RTC బస్సులు.. సద్వినియోగం చేసుకోండి

image

రానున్న శ్రావణమాసంలో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాలకు దృష్టిలో ఉంచుకొని డిపాజిట్ లేకుండా RTC బస్సులు అద్దెకు ఇవ్వనున్నట్లు MBNR ఆర్టీసీ డిపోమేనేజర్ సుజాత తెలిపారు. ప్రైవేట్ వారితో పోలిస్తే అతి తక్కువ ధరతో ఆర్టీసీ హైర్ స్పెషల్ బస్సులను బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. గతంలో డిపాజిట్ చేసిన తర్వాతనే బస్సు బుక్ చేసుకుని నిబంధనలను సడలించామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు