Telangana

News August 28, 2024

ధర్మసాగర్: డెంగ్యూతో బాలిక మృతి

image

ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ప్రవళికకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. హన్మకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు డెంగ్యూ అని నిర్ధారించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. బాలిక తమ్ముడు కూడా జ్వరంతో బాధపడుతున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జ్వరంతో బాలిక మృతి చెందగా గ్రామంలో ప్రజలు భయపడుతున్నారు.

News August 28, 2024

HYD: మరో పదేళ్లు మాదే అధికారం: మంత్రి

image

BRS నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని రంగారెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు KCR పాలన చూసి విసుగు చెంది BRSను ఓడించి, తమను గెలిపించారని మంగళవారం HYDలో ఒక ప్రకటనలో తెలిపారు. రుణమాఫీపై అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొట్టడం మానుకోకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు.

News August 28, 2024

HYD: మరో పదేళ్లు మాదే అధికారం: మంత్రి

image

BRS నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని రంగారెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు KCR పాలన చూసి విసుగు చెంది BRSను ఓడించి, తమను గెలిపించారని మంగళవారం HYDలో ఒక ప్రకటనలో తెలిపారు. రుణమాఫీపై అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొట్టడం మానుకోకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు.

News August 28, 2024

వీర్నపల్లి: అనారోగ్యంతో ఓ మహిళ మృతి

image

వీర్నపల్లి మండలానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం అంకమళ్ళ రేఖ (35) అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. భర్త సుదర్శన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మృతి చెందాడు. అప్పటినుంచి రేఖ తల్లి గారైన రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఉంటుంది. మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. తల్లిదండ్రులు చనిపోవడంతో కూతురు అనాథగా మిగిలిపోయింది.

News August 28, 2024

మెదక్: క్వారీ నీటి గుంతలో పడి యువకులు మృతి

image

మెదక్ జిల్లా మాసాయిపేటలో ఉన్న క్వారీ నీటి గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నిన్న సాయంత్రం ముగ్గురు యువకులు ఈతకు వెళ్లగా అందులో మునిగి ఇద్దరు మృతి చెందారు. గట్టు మీద ఉన్న మరో యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయి విషయాన్ని చెప్పకుండా దాచాడు. ఈ రోజు ఉదయం విషయం చెప్పడంతో ఘటన స్థలానికి పోలీసులు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News August 28, 2024

MBNR: DSC 508 ఖాళీలు..14,577 మంది ఎదురుచూపు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 508 ఖాళీలకు గాను..14,577 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు 13న విడుదల చేసిన ప్రాథమిక కీపై రాష్ట్ర వ్యాప్తంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరు నాటికి తుది కీ ప్రకటించి ఫలితాలు విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. MBNR-1:27, NGKL-1:29, GDWL-1:40, NRPT-1:19, WNPT-1:40 జిల్లాల్లో నిష్పత్తిలో పోటీ నెలకొంది.

News August 28, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా గుండుమల్లో 95.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా సల్కరిపేటలో 31.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 29.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దముద్దూనూరులో 21.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాల్పాడులో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 28, 2024

ఆదిలాబాద్: రేషన్ కార్డులు లేనివారికి రుణమాఫీ

image

ఆదిలాబాద్ జిల్లాలో రూ.2లక్షల లోపు రుణం ఉండి రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3 విడతల్లో రుణమాఫీ అయింది. రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులను గుర్తించి వారి కుటుంబ వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించనున్నారు.

News August 28, 2024

కాంగ్రెస్, బీజేపీ బెదిరింపులకు కేసీఆర్ లొంగరు: శ్రీనివాస్ గౌడ్

image

కల్వకుంట్ల కవిత బెయిల్ తప్పు పట్టే విధంగా మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ చావడానికైనా సిద్ధం కానీ.. ఆ పార్టీల బెదిరింపులకు లొంగరని అన్నారు. న్యాయమూర్తులు అన్ని విషయాలు విచారించిన తర్వాత బెయిల్ మంజూరు చేశారని, అనవసరపు ఆరోపణలు చేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని నేతలపై మండిపడ్డారు.

News August 28, 2024

తొర్రూరు: విష జ్వరంతో వ్యక్తి మృతి

image

విష జ్వరంతో వ్యక్తి మృతి చెందిన ఘటన తొర్రూరు మండలం కెవుల తండాలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ లచ్చిరాం (52) గత వారం రోజులుగా విష జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. వైద్యం కోసం వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.