Telangana

News July 25, 2024

కాంగ్రెస్ తొలి బడ్జెట్.. కరీంనగర్ ఆశిస్తుందిదే..

image

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సిరిసిల్ల JNTU బిల్డింగ్, గల్ఫ్ వెళ్లిన వారి సంక్షేమం , వస్త్రోత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమ స్థాపన ప్రస్తావన ఉంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

News July 25, 2024

మొన్న వరంగల్ ఊసే లేదు.. మరి ఇవాళ

image

కేంద్ర బడ్జెట్‌లో బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల ఊసే లేకపోవడంతో ఓరుగల్లుకు నిరాశే ఎదురైంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఇందులోనైనా ప్రాధాన్యం దక్కుతుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి, కేయూ అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల డెవలప్‌ చేయాల్సి ఉంది. వరంగల్ కాకతీయ మెగా జౌళి పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇవ్వాల్సి ఉంది.

News July 25, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. @61 ఇయర్స్..!

image

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నేటితో 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేయగా, 1978లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజలకు తాగు, సాగు నీరు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.

News July 25, 2024

ఆదిలాబాద్‌ జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు

image

ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దార్‌లు16 మంది, సినియర్. 25 మంది, జూ.అసిస్టెంట్లు 15 మంది, ఆఫీస్ సబార్డినేట్లు 18 మంది ఉన్నారు. వారితో పాటు ఐదుగురు తహశీల్దార్లకు రిలీవింగ్ ఆర్డర్లు జారీ అయ్యాయి.

News July 25, 2024

గంజాయి తీసుకుని 45 రోజులైనా గుర్తిస్తాం: CI శ్రీధర్ రెడ్డి

image

గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ఇప్పుడు ప్రత్యేక కిట్టునే ఉపయోగిస్తోంది. ”గంజాయి తాగే వారిని గుర్తించేందుకు ఎబాన్‌ డ్రగ్‌ యూరిన్‌ టెస్టింగ్‌ కిట్‌ను ఉపయోగిస్తున్నాం. 45 రోజులైనా ఇది గంజాయి తీసుకున్న వారిని గుర్తిస్తుంది. అనుమానం వచ్చిన ప్రతీ వ్యక్తి యూరిన్‌ను పరీక్ష చేసి నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తాం. గంజాయి నిర్మూలనకు ప్రతీ ఒక్క పౌరుడు సహకరించాలి” అని కోదాడ సీఐ శ్రీధర్ రెడ్డి చెప్పారు.

News July 25, 2024

మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

image

మెదక్ పట్టణం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్లు నీరుడి రాము, యం.రవి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతోపాటు ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు అందడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా తప్పవని హెచ్చరించారు.

News July 25, 2024

HYD: వీధి కుక్కల సమస్యా.. ఫోన్ చేయండి

image

వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో GHMC కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్ సెంటర్ పని చేస్తుందని, 040-21111111, 23225397 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. కుక్కకాటువల్ల ఇటీవల జవహర్ నగర్‌లో ఓ చిన్నారి చనిపోవడం, ఈ తరహా దుర్ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News July 25, 2024

HYD: వీధి కుక్కల సమస్యా.. ఫోన్ చేయండి

image

వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో GHMC కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్ సెంటర్ పని చేస్తుందని, 040-21111111, 23225397 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. కుక్కకాటువల్ల ఇటీవల జవహర్ నగర్‌లో ఓ చిన్నారి చనిపోవడం, ఈ తరహా దుర్ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News July 25, 2024

రంగారెడ్డి: సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమావేశం

image

వనమహోత్సవం, మహిళా శక్తి, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ శశాంక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా వర్షాకాలంలోనే మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

News July 25, 2024

తండ్రి కేసీఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకున్న KTR

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్యతో కలిసి.. తండ్రి కేసీఆర్, తల్లి శోభమ్మలకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు.ఈ సందర్భంగా కుమారుడు కేటీఆర్‌ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్.. మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.