Telangana

News March 28, 2024

మణుగూరు: రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి

image

మణుగూరు మండలం సమితిసింగారం రహదారిపై పాత సమ్మయ్య ఆసుపత్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంబమూర్తి(55) అనే సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. మణుగూరు నుంచి పీవీ కాలనీకి బైక్‌పై వెళ్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సాంబమూర్తి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 28, 2024

చౌటుప్పల్: లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రిమాండ్

image

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ దండు మల్కాపురంలోని ఓ కంపెనీలో పని చేస్తుంటారు. ఈనెల 25న రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ నిమిత్తం నల్గొండ జైలుకు తరలించారు.

News March 28, 2024

MBNR: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సెక్టార్, రూట్ అధికారులు, పీవో, ఏపీవోలు కలిపి మొత్తం 450 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకురాలిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

News March 28, 2024

కాటారం: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

News March 28, 2024

MDK: చిరుత దాడిలో లేగ దూడ మృతి?

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపనయ్య మూసుకు తండా శివారులో లేగ దూడను గుర్తుతెలియని అడవి జంతువు చంపేసింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గుగులోత్ బిమ్లాకు చెందిన లేక దూడ మరణించింది. అయితే ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని, చిరుత దాడిలోనే దూడ మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. చిరుత పులి దాడి పై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

News March 28, 2024

అమెరికాలో బచ్చన్నపేట మండల వాసి మృతి

image

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలో గుండె పోటుతో మృతిచెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. చిట్టోజు మదనాచారి, ప్రమీల దంపతుల కుమారుడు మహేశ్.. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు. ఈక్రమంలో ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురికాగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. కాగా, మృతదేహం గ్రామానికి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది.

News March 28, 2024

బల్కంపేట ఎల్లమ్మ సన్నిధిలో నీతా అంబానీ

image

హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా బుధవారం నగరానికి విచ్చేసిన నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీకి ఈవో కుంట నాగరాజు, ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్ ఘన స్వాగతం పలికారు. దాదాపు 15 నిమిషాల పాటు నీతా అంబానీ ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో గడిపారు. అనంతరం మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు.

News March 28, 2024

బల్కంపేట ఎల్లమ్మ సన్నిధిలో నీతా అంబానీ

image

హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా బుధవారం నగరానికి విచ్చేసిన నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీకి ఈవో కుంట నాగరాజు, ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్ ఘన స్వాగతం పలికారు. దాదాపు 15 నిమిషాల పాటు నీతా అంబానీ ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో గడిపారు. అనంతరం మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు.

News March 28, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
> భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలపై సమీక్ష సమావేశం
> ఖమ్మం జిల్లాలో బార్ అసోసియేషన్ ఎన్నికలు
> కొత్తగూడెంలో BJPఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పర్యటన
> ఎంపీ ఎన్నికలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష
> అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> కల్లూరులో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
> కామేపల్లి మండలం తాళ్ల గూడెంలో తిరుపతమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం

News March 28, 2024

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా!

image

1.MBNR(ఎంపీడీఓ కార్యాలయం)-245
2.కొడంగల్(ఎంపీడీఓ కార్యాలయం)-56
3.NRPT(ఎంపీడీఓ కార్యాలయం)-205
4.WNPT(ఆర్డీఓ ఆఫీస్)-218
5.GDWL(జడ్పీ కార్యాలయం)-225
6.కొల్లాపూర్(బాలికల జూనియర్ కళాశాల)-67
7.NGKL(బాలుర జడ్పీహెచ్ఎస్)-101
8.అచ్చంపేట(బాలికల జడ్పీహెచ్ఎస్)-79
9.కల్వకుర్తి(ప్రభుత్వ జూనియర్ కళాశాల)-72
10.షాద్ నగర్(ఎంపీడీఓ కార్యాలయం)-171
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు,1,439 మంది ఓటర్లు ఉన్నారు.

error: Content is protected !!