Telangana

News July 28, 2024

భూపాలపల్లి జిల్లాలో 450mm వర్షపాతం

image

భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు 450.0 MM వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.. పలు మండలాల వివరాలు చూస్తే
మహదేవపూర్ 35.6, పలిమెల 12.4, మహాముత్తారం 75. 2, కాటారం87.2, మల్హర్ 41.0, చిట్యాల 38.4, టేకుమట్ల 33.6, మొగుళ్లపల్లి 35. 2, రేగొండ:25. 2, ఘనపూర్ 22.4 భూపాలపల్లి 43.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

News July 28, 2024

పటాన్‌చెరు: ప్రేమ పెళ్లి.. 6 నెలలకే వివాహిత సూసైడ్

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న 6నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్పూర్‌లో జరిగింది. APలోని గుంటూరుకు చెందిన హర్షిత, ఎడ్లపాడు చెందిన మహేశ్ పేరెంట్స్ సమక్షంలో ఫిబ్రవరి 23న పెళ్లి చేశారు. అమీన్పూర్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటుండగా మహేశ్‌కు ఉద్యోగం లేకపోవడంతో హర్షిత తండ్రి నెలకు రూ.30వేలు పంపాడు. ఇటీవల IT జాబ్ వచ్చినా మహేశ్ వెళ్లకపోగా ఆస్తిలో వాటా కోసం భార్యను వేధించగా మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది.

News July 28, 2024

PU పరిధిలో 31 నుంచి ప్రయోగ పరీక్షలు

image

ఐదేళ్ల కోర్సు అయిన ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (కెమెస్ట్రీ) 4వ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7 వరకు నిర్వహిస్తున్నట్లు పీయూ పరీక్షల నియంత్రణ విభాగం అధికారి రాజ్ కుమార్ తెలిపారు. రెగ్యులర్తో పాటు బ్యాక్ లాక్ విద్యార్ధులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు, 2022 బ్యాచ్ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్‌తో పాటు సెమినార్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News July 28, 2024

నారుమడుల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడండి !

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నారు మాడుల్లో వర్షపు నీరు ఉండకుండా చూడాలని పాలెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షపు నీరు అలాగే పొలంలో నిల్వ ఉండటం చేత అనేక సూక్ష్మజీవులు పెరిగి పంటను నాశనం చేస్తాయని, అందుకుగాను కురిసిన వర్షపు నీరు వెంటనే పంట పొలాల నుండి వెలికి తీయాలని రైతులకు తెలిపారు. పత్తి, కంది, పెసరు పంటలు అధిక నీరు వలన చనిపోతాయని నీరు నిలవకుండా చూడాలన్నారు.

News July 28, 2024

SRSP అప్డేట్: 24గంటల్లో 23,599 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గడిచిన 24 గంటల్లో సుమారు 23,599 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి 624 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,074.6 అడుగుల మేర ఉందని చెప్పారు.

News July 28, 2024

సర్కారు స్కూళ్లను వెంటాడుతున్న సమస్యలు

image

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 3210 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 2.11 లక్షల పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సాధారణంగా సర్కార్ బడుల నిర్వహణకు ప్రభుత్వం ఏడాదికి రెండు పర్యాయాలు నిధులు మంజూరు చేస్తుంది. స్కూలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నేటి వరకు నిర్వహణ గ్రాంటును విడుదల చేయలేదు.

News July 28, 2024

మెదక్‌లో కారు బీభత్సం.. మున్సిపల్ కార్మికుడి మృతి

image

మెదక్ పట్టణంలోని వడ్డెర కాలనీ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి రోడ్డుపై పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మైసయ్య(50)ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో పదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం రోడ్డుపై పనిచేసే కార్మికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.

News July 28, 2024

వీధి వ్యాపారులకు త్వరలో పీఎం స్వనిధి కార్డుల పంపిణీ

image

మున్సిపాలిటీల్లోని వీధి వ్యాపారులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వారి వ్యాపార నిర్వహణకు ఇప్పటికే రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు వీధి వ్యాపారానికి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో 37,784 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. తాజాగా ఆయా వ్యాపారాలు చేసే పనికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News July 28, 2024

NLG: జిల్లాలో ఇక స్థానిక జోష్

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

News July 28, 2024

భద్రాద్రికి వరదొస్తే దినదిన గండమేనా

image

భద్రాచలం వద్ద ఉన్న గోదావరి ఉప్పొంగిన ప్రతీ ఏడాది ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. గోదావరి వరదతో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, పినపాక, బూర్గంపాడు మండలాలకు వరద ప్రమాదం పొంచి ఉందా అంటే అవునని సమాధానం వస్తోంది. మరి ఎందుకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. వరద తీవ్రమైతే భద్రాచలం పరిస్థితి ఏంటి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంటే ఎందుకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.