Telangana

News March 27, 2024

HYD: ఇనుప రాడ్డు మెడకు గుచ్చుకొని వ్యక్తి మృతి

image

ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. బాలానగర్‌ వాసి పవన్(35) ఫ్యాబ్రికేషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. KPHB రోడ్ నం.1లోని ఐరిస్ షోరూమ్ షట్టర్ మరమ్మతులు చేసేందుకు వచ్చాడు. నిచ్చెన వేసుకుని మరమ్మతులు చేస్తుండగా షట్టర్ రాడ్డు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై కింద ఇనుప రాడ్డుపై పడటంతో అది మెడకు గుచ్చుకొని మృతిచెందాడు. 

News March 27, 2024

MBNR: ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బే ?

image

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడి ఆరిపోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటికి వెళ్తే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట లేత రంగు బట్టలు ధరించాలి.

News March 27, 2024

ఉప్పల్: ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో శుభవార్త

image

ఉప్పల్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో శుభవార్త తెలిపింది. ఉప్పల్ స్టేడియం, నాగోల్, ఎన్.జీ.ఆర్.ఐ స్టేషన్లలో అర్ధరాత్రి మెట్రో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రి 12.15 గంటలకు మెట్రో ట్రైన్ ప్రారంభమై 1.10 గంటలకు చివరి స్టాప్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఐపీఎల్ మ్యాచ్‌కు వచ్చేవారు వినియోగించుకోవాలని సూచించారు.

ఖమ్మం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

జూలూరుపాడు మండలం పడమట నర్సాపురానికి చెందిన బాదావత్ రాందాస్ ఆర్టీసీలో బస్సులో ప్రయాణిస్తూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాందాస్ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో తన భార్యతో కలిసి చికిత్స నిమిత్తం బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో బస్సు చిట్యాల శివారులో రాందాస్‌కు గుండెనొప్పి వచ్చింది. సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదని ప్రయాణికులు చెప్పారు.

News March 27, 2024

MBNR: మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమే

image

పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ పోటీపడుతూ గత ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేలా వ్యూహాలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉండడంతో పాటు ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులకు ఎప్పటికీ అప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

News March 27, 2024

HYD: మోసం చేసి కాంగ్రెస్ గెలుస్తుందా?: మల్లారెడ్డి

image

మేమే గెలుస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారని, మళ్లీ ఎట్లా గెలుస్తారని, మోసం చేసి గెలుస్తారా అని మేడ్చల్ MLA మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తూ ఈరోజు మల్కాజిగిరిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP నేతలు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో BRSదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేడర్ లేదని ఎద్దేవా చేశారు.

MBNR: మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయం: డీకే అరుణ

image

గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని బీఆర్ఎస్‌పై వ్యతిరేకతతో ఓట్లు వేశారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. జడ్చర్ల‌లో బీజేపీ పార్లమెంటు నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మోడీని చూసి ఓట్లు వేస్తారని అన్నారు. మళ్లీ మూడోసారి మోదీ ప్రధాని అవుతారని అన్నారు.

News March 27, 2024

పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి

image

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల మమత, కుమార్ ల కుమారుడైన ముక్కర్ల ఉమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గం.లకు కట్లపాము కాటు వేయడంతో భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

error: Content is protected !!