Telangana

News August 28, 2024

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వంగపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిమ్యా నాయక్ భువనగిరిలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. విధులు ముగించుకొని బైక్‌పై ఆలేరుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News August 28, 2024

శ్రీశైలం జలాశయం UPDATE

image

శ్రీశైలం జలాశయంలో మంగళవారం 884.3 అడుగుల నీటిమట్టం, 211.4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి 2,08,001 క్యూసెక్కుల వరద శ్రీశైలం డ్యాంకు వచ్చింది. అక్కడి నుంచి మొత్తం 68,744 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30వేలు, రేగుమాన్ గడ్డ నుంచి MGKLAకు 1,931, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి HNSSకు 1,490 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.

News August 28, 2024

Rewind: ఆగస్టు 28.. ఉలిక్కిపడ్డ హైదరాబాద్

image

28-08-2000 రోజు HYD ఉలిక్కిపడింది. విద్యుత్ ఛార్జీలు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ర్యాలీ బషీర్‌బాగ్‌కు చేరగానే పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి, టియర్ గ్యాస్, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చనిపోయారు. నేడు ఆ అమరులకు కామ్రేడ్‌లు నివాళి అర్పిస్తున్నారు.

News August 28, 2024

Rewind: ఆగస్టు 28.. ఉలిక్కిపడ్డ హైదరాబాద్

image

28-08-2000 రోజు HYD ఉలిక్కిపడింది. విద్యుత్ ఛార్జీలు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ర్యాలీ బషీర్‌బాగ్‌కు చేరగానే పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి, టియర్ గ్యాస్, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చనిపోయారు. నేడు ఆ అమరులకు కామ్రేడ్‌లు నివాళి అర్పిస్తున్నారు.

News August 28, 2024

జగిత్యాల: ఎస్సారెస్పీ తాజా సమాచారం

image

శ్రీరాంసాగర్ జలాశయంలోకి మంగళవారం సాయంత్రం వరకు 24,014 క్యూసెక్కుల చొప్పున వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అటు కాకతీయ, సరస్వతి కాలువలకు, మిషన్ భగీరథకు కలుపుకుని మొత్తం ఔట్ 4,459 క్యూసెక్కులుగా ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90.13 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో ప్రస్తుతం 58.70 నీటినిల్వ టీఎంసీలుగా ఉందన్నారు.

News August 28, 2024

NZB: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో మాక్లూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో పాటు మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 28, 2024

NZB: సెప్టెంబర్ 29న దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పోటీలు

image

నిజామాబాద్ జిల్లాలో తపాలా శాఖ ఆధ్వర్యంలో 6-9వ తరగతి విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న జరిగే పోటీలో ఎంపికైనా వారు ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫలితాలను నవంబర్ 14న విడుదల చేయనున్నారు. గెలుపొందిన విద్యార్థుల ఖాతాల్లో ఏడాదికి రూ.6వేల ఉపకార వేతనం జమచేస్తారు. NZB, KMR, ఆర్మూర్ పోస్ట్ ఆఫీసుల్లో పోటీకి సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.

News August 28, 2024

మహబూబ్‌నగర్ జిల్లాలో ఇదీ పరిస్థితి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా చోట్ల చెరువులు కబ్జాకు గురయ్యాయి. HYDలో హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనూ ఇలాంటి వ్యవస్థను తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. MBNR, గద్వాల, NGKL, WNP, NRPT జిల్లాల్లోని పట్టణాలు, మండలాల్లోని పలు చెరువులు, ప్రభుత్వం స్థలాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు విమర్శలు ఉన్నాయి.

News August 28, 2024

సీరోలు: దారుణం.. గొడ్డలితో తండ్రిపై కొడుకు దాడి

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి గ్రామ శివారు కొత్త తండాలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకున్నది. భూ తగాదా విషయంలో తండ్రిపై కొడుకు స్వామి గొడ్డలితో దాడి చేయడంతో తండ్రి బానోత్ బీమా నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బీమా నాయక్ ను మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 28, 2024

తానూర్: రోజు గడవక ముందే భార్య, భర్త మృతి

image

భార్య చనిపోయిన అదే రోజు భర్త మృతి చెందిన ఘటన తానూర్‌లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన బండేవార్ పోశెట్టి (91), పెంటుబాయి (86) దంపతులు. కాగా పెంటుబాయి మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది. భార్య అంత్యక్రియలు మధ్యాహ్నం జరగగా అదే రోజు రాత్రి 10గంటలకు మనోవేదనతో ఆమె భర్త పోశెట్టి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.