Telangana

News July 14, 2024

అనంతగిరికి పోటెత్తిన హైదరాబాదీలు

image

అనంతగిరికి పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో వికారాబాద్ జిల్లాకు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం ప్రఖ్యాత శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టు‌లో బోటింగ్‌ ఉండడంతో‌ టూరిస్టులతో సందడిగా మారింది.

News July 14, 2024

సంగారెడ్డిలో రేపు ప్రజావాణి

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 15న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా సమస్యలపై వినతి పత్రాలను స్వీకరిస్తామని చెప్పారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

News July 14, 2024

ప్రతి పారిశ్రామికవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలి: బీఎంఎస్

image

కనీసం పెన్షన్లు రూ.5000లకు పెంచాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియాకు ఆదివారం న్యూఢిల్లీలో జాతీయ బీఎంఎస్ ప్రతినిధులు తెలిపారని జిల్లా కార్యదర్శి పి. మోహన్ రెడ్డి సంగారెడ్డిలోని జిల్లా కార్యాలయంలో తెలిపారు. సీలింగ్ పెంపు వల్ల అధిక సంఖ్యలో కార్మికులకు పథకాలు వర్తిస్తాయని, ప్రతి పారిశ్రామిక వాడలో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారని వారు చెప్పారు.

News July 14, 2024

KA పాల్ ఆశీస్సులు తీసుకున్న NGKL ఎంపీ మల్లురవి

image

నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి నేడు తన పుట్టినరోజు సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆశీస్సులు పొందారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిగా పనిచేసే ప్రజల మన్ననలు పొందాలని పాల్ సూచించినట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మల్లురవి జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి.

News July 14, 2024

దస్తురాబాద్: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దస్తురాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుడిసెర్యాల గ్రామానికి చెందిన పవన్ ప్రేమ విఫలమై మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. దీంతో కుటుంబీకులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పవన్ ఆదివారం మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News July 14, 2024

HYD: ఈత మొక్కలను నాటిన సీఎం

image

గీత కార్మికులకు కాటమయ్య రక్ష కవచాలను అందించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక తాటి వనంలో ఈత మొక్కలను స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి నాటారు. అనంతరం కాటమయ్య రక్ష కవచాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

News July 14, 2024

HYD: ఈత మొక్కలను నాటిన సీఎం

image

గీత కార్మికులకు కాటమయ్య రక్ష కవచాలను అందించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక తాటి వనంలో ఈత మొక్కలను స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి నాటారు. అనంతరం కాటమయ్య రక్ష కవచాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

News July 14, 2024

జమ్మికుంట: పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

image

జమ్మికుంట మండలం శంభునిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు వారి నుంచి రూ.16,510 స్వాధీనం చేసుకున్నారు. వడ్లూరి రాజేశ్వర్, చింత రమణారెడ్డి, తన్నీరు శీను, మ్యాడగోని తిరుపతి, గడ్డం శ్రీనివాస్, మండల రాజేందర్ కర్నకంటి శ్రీనివాస్ రెడ్డి పట్టుబడ్డారు.

News July 14, 2024

ఎల్లారెడ్డి: పాము కాటుతో వ్యక్తి మృతి

image

ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాము కాటుతో ఒకరి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంభం నాగయ్య (45) శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో పాము కాటు వేయడంతో, కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం కామరెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే నాగయ్య మృతి చెందినట్లు తెలిపారు.

News July 14, 2024

బోనం ఎత్తుకున్న ఝాన్సీరెడ్డి

image

మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్‌లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డి బోనం ఎత్తుకొని సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని ఝాన్సీరెడ్డి ఆకాంక్షించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.