Telangana

News March 26, 2024

భద్రాద్రి ఆలయ ఆఫీసులో మృతదేహం కలకలం

image

భద్రాద్రి ఆలయ ఆఫీసులో మృతదేహం కలకలం సృష్టించింది. రామాలయం సీఆర్‌ఓ కార్యాలయం పైఅంతస్తులోని బాత్రూంలో ఆఫీస్ సిబ్బంది మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. మృతుడు ఖమ్మంకి చెందిన జాఫర్‌‌గా గుర్తించారు. ఆయన రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల్లో టైల్స్‌ పనికి వచ్చినట్టు చెబుతున్నారు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2024

HYD: త్వరలో 14.5MW విద్యుత్ ప్లాంట్ ప్రారంభం

image

గ్రేటర్ HYD పరిధి దుండిగల్‌లోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా 14.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. దీనికోసం దాదాపుగా 1500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. TSSPDCLతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సైతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. GHMC పరిధిలో నిత్యం సుమారు 8000 మెట్రిక్ టన్నుల గార్బేజ్ విడుదలవుతోంది.

News March 26, 2024

HYD: త్వరలో 14.5MW విద్యుత్ ప్లాంట్ ప్రారంభం

image

గ్రేటర్ HYD పరిధి దుండిగల్‌లోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా 14.5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. దీనికోసం దాదాపుగా 1500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. TSSPDCLతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సైతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. GHMC పరిధిలో నిత్యం సుమారు 8000 మెట్రిక్ టన్నుల గార్బేజ్ విడుదలవుతోంది.

News March 26, 2024

మెదక్‌: రైలు కింద పడి సూసైడ్

image

రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడు మెదక్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

News March 26, 2024

దస్తురాబాద్: పాము కాటుతో యువకుడు మృతి..!

image

పాము కాటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన దస్తురాబాద్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొడిసెర్యాల గోండుగూడెంకు చెందిన మెస్రం భుజంగరావు(26)కు ఈనెల 18న పాము కాటేసింది. అయితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేకపోవడంతో ఆకొండపేట్‌లో నాటు వైద్యం తీసుకుంటున్నాడు. సోమవారం పరిస్థితి విషమించడంతో నిర్మల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News March 26, 2024

MBNR: హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్.!

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమని.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని.. హరీష్ రావు చర్చకు సిద్ధమా.? అని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. ఎప్పుడూ ఎవరొకరి ఫోన్ ట్యాప్ చేయాలని చూశారని ఆరోపించారు. పదేళ్లుగా ప్రజలకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.

News March 26, 2024

నిజామాబాద్: మట్టి కుండ.. సల్ల గుండ

image

వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే మట్టి కుండలకు ట్యాప్‌ (నల్ల) ఏర్పాటు చేసి NZB జిల్లా కేంద్రంలో విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఈ కుండలు లభిస్తున్నాయి. వివిధ సైజులు, ఆకృతులను బట్టి విటి ధర నిర్ణయించబడి ఉంది. వేసవిలో పేదవాడి ఫ్రిజ్‌గా చెప్పుకునే వీటికి సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉంది. ఎర్రటి మట్టి కుండలోని చల్లటి నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు

News March 26, 2024

నల్గొండ: తండ్రి మరణం… ‘కూతురికి పరీక్ష’

image

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని పదవ తరగతి పరీక్ష రాసిన ఘటన త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తవిడబోయిన చంద్రశేఖర్ అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించారు. శేఖర్ కూతురు గాయత్రి మంగళవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఫిజిక్స్ ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.

News March 26, 2024

WGL: హోలీ పండుగ మిగిల్చిన విషాదం.. ఏడుగురు మృతి

image

హోలీ ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. వెంకటాపురం మండలంలో స్నేహితులిద్దరు కాల్వలో స్నానం చేసి బైక్‌పై వస్తూ చెట్టును ఢీకొని మృతిచెందారు. హసన్‌పర్తి మం.లో పలివేల్పుల, గుండ్లసింగారం సమీపంలో SRSP కాల్వలో స్నానాలకు వెళ్లిన ముగ్గురు గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. నర్సింహులపేట మం.లో చెరువులోకి ఈతకెళ్లిన బాలుడు మునిగి చనిపోయాడు.

News March 26, 2024

మల్కాజిగిరిపై సీఎం SPECIAL ఫోకస్

image

మల్కాజిగిరి సీటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సిట్టింగ్ స్థానం కావడం, మరోవైపు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. సునీతారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధం కావాలని సూచించారు. కాగా BRS నుంచి రాగిడి, BJP నుంచి ఈటల పోటీ చేస్తున్నారు.

error: Content is protected !!