Telangana

News August 4, 2024

BREAKING: ఉదయాన్నే కామారెడ్డి డిపో బస్సుకు ప్రమాదం

image

తూప్రాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి డిపోకి చెందిన బస్సు మరో బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సును రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మెకానిక్‌లకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవే-44పై వాహనాలు నిలిచాయి.

News August 4, 2024

వరంగల్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే ఓరుగల్లు వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day

News August 4, 2024

NZB: డ్రైనేజీ నిర్మాణానికి తవ్వకం.. కూలిన అపార్ట్‌మెంట్ ప్రహరీ

image

డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి పొక్లైన్‌తో తవ్వుతుండగా అపార్ట్‌మెంట్ ప్రహరీ కూలిన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. ఫేజ్-2లోని ప్రధాన రహదారిపై లక్ష్మీ బాలాజీ నిలయం అపార్ట్‌మెంట్ వద్ద డ్రైనేజీ కోసం తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని అపార్ట్‌మెంట్ వారు ఆరోపించారు.

News August 4, 2024

ADB: 5 నుంచి శ్రావణం.. నెలరోజులు మస్తు లగ్గాలు

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈనెల 5 నుంచి శ్రావణమాసం మెుదలవుతోంది. ఈనెల 8, 9,10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని, శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 4, 2024

హైదరాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే హైదరాబాదీ‌లు ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. ఫెయిర్ వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day

News August 4, 2024

NRML: ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ సదస్సులో పాల్గొన్న ఆర్జీయూకేటీ వీసీ

image

హైద్రాబాద్‌లో FCCI ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ కార్యక్రమానికి యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీష్ కుమార్ ఆహ్వానం మేరకు బాసర ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్తంగా తెలంగాణలో ఉన్నత విద్యకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు. వెంకటరమణ మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ సాధికారత జరగాలంటే విద్యార్థి-కేంద్రీకృత అభ్యాసం పై దృష్టి పెట్టాలన్నారు.

News August 4, 2024

KNR: ఈనెల 5న ప్రజావాణి రద్దు

image

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం (ఆగస్టు 5వ తేదీన ) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరిగి ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ వివరించారు.

News August 4, 2024

రైతులకు నల్గొండ కలెక్టర్ సూచన

image

నాగార్జునసాగర్ నీటితో జిల్లాలోని అన్ని చెరువులు నింపనున్న దృష్ట్యా రైతులెవరు సాగునీటిని మళ్ళించుకోకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శనివారం ఆయన నాగార్జునసాగర్ నీటి వినియోగంపై రెవెన్యూ, పోలీస్,ఇరిగేషన్, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా రాష్ట్ర మంత్రులు శుక్రవారం సాగునీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.

News August 4, 2024

ఆర్మూర్: దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చక్కటి నిదర్శనం: కలెక్టర్

image

ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎదుగుదల చక్కటి నిదర్శనమని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ, ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తాను పుట్టిపెరిగిన ప్రాంతం, చదువుకున్న బడిని మర్చిపోకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవార్డులను అందించడం గొప్ప విషయమని కొనియాడారు.

News August 4, 2024

మహబూబాబాద్: ఆగస్టు 5న ప్రజావాణి రద్దు

image

కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఆగస్టు 5న సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా దీనిని ప్రజలు గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.