India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలం పట్టణంలోని వంతెన వద్ద స్థానిక పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో శుక్రవారం భారీగా గంజాయి పట్టుబడింది. అనుమానస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా 67 కేజీల ఎండు గంజాయి దిండ్లు పట్టుబడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గంజాయి విలువ సుమారు రూ.16.75లక్షలు ఉంటుందని తెలిపారు.
నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అర్హత కలిగిన వారు మొత్తం 43,326 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,992 మంది, మహిళలు 20,330 మంది ఉన్నారు. వీరిలో దివ్యాంగ ఓటర్లు 33,839 మంది.. 85ఏళ్లు పైబడిన ఓటర్లు 9,487 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఓటర్లు మాత్రమే ఫారం-12డీ ద్వారా నేటి నుంచి దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి.. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అనుమతిస్తారు.
వరంగల్ జిల్లా సంగెం మండల ఎంపీపీ కందగట్ల కళావతి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మండలంలోని ఎంపీటీసీలు అందుకు సంభందించిన తీర్మాన పత్రాన్ని శుక్రవారం వరంగల్ ఆర్డీవో సీదం దత్తుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో వివిధ హోదాలలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికార దాహంతో పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకోవడంతోనే ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు తెలిపారు.
గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారవ.. వెన్నంపల్లి గ్రామానికి చెందిన మారుపాక మహేష్(30) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. మహేష్‌కు గురువారం రాత్రి గుండెలో నొప్పి రావడంతో హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయ అధికారి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సాంఘీక సంక్షేమ గురుకుల వెబ్ సైట్ tswreis.inలో పరిశీలించాలని కోరారు.
అలంపూర్‌లో సవరన్న, ప్రేమమ్మ దంపతులకు 1967లో జన్మించిన RS ప్రవీణ్ కుమార్.. ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీలో చేశారు. 1995 బ్యాచ్ IPSగా ఎంపికైన RSP స్వేరోస్ సంస్థ స్థాపించి పలు కార్యక్రమాలు చేపట్టారు. గతేడాది తన ఉద్యోగానికి రిజైన్ చేసిన ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా BRSలో చేరి NGKL ఎంపీగా పోటీ చేస్తున్నారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావుకు జాతీయస్థాయిలో నామినేటెడ్ పోస్ట్ బీజేపీ హైకమాండ్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటును బాబురావుకు కాకుండా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నగేశ్‌ను ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో సోయం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు శుక్రవారం ఆయన చాంబర్ లో కలిశారు. మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రతాప్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల అంశంపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు.
ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగేశ్వరరావు పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. కాగా నామా పార్టీ మారతారని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి బరిలో ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై నామా స్పందిస్తూ.. తాను బీఆర్ఎస్ నుంచే ఖమ్మం ఎన్నికల్లో బరిలో దిగుతానని పేర్కోన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని నామా స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నామా ఖమ్మం రానున్నారు.
వేములవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి ఎస్పీ అఖిల్ మహాజన్ అటాచ్ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్‌లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.