Telangana

News July 14, 2024

ADB: రానున్న 5 రోజులు భారీ వర్షాలు

image

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీమ్ జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్ష సూచన ఉందని ప్రకటించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News July 14, 2024

నాగర్‌కర్నూల్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స 

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. జిల్లాకు చెందిన యువకుడు చందు(18) పుట్టుకతోనే నాలుక అతుక్కుని ఉండడంతో మాట్లాడలేని పరిస్థితి. బీద కుటుంబం కావడంతో దీనిపై తల్లిదండ్రులు సూపరింటెండంట్‌ను కలిశారు. పరీక్షించిన వైద్యులు ప్రొ. డాక్టర్ గాయత్రీ, డాక్టర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో అతుక్కున్న నాలుకకు విజయవంతంగా సర్జరీ చేసినట్లు చెప్పారు.

News July 14, 2024

HYDలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశాలు

image

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్‌లు, EVDM టీమ్‌లతో మేయర్ గద్వాల విజయ లక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

News July 14, 2024

గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన జిల్లా ఎస్పీ

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆదివారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డికి జిల్లా ఎస్పీ పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా ఎస్పీకి సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

News July 14, 2024

BREAKING: కాంగ్రెస్ గూటికి ఆదిలాబాద్ BJP కౌన్సిలర్

image

అదిలాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. మున్సిపల్ వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం పట్టణంలోని ప్రజాసేవ భవనంలో 25వ వార్డు బీజేపీ కౌన్సిలర్ పిన్నవార్ రాజేశ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News July 14, 2024

రేపు కరీంనగర్‌లో మంత్రి పొన్నం పర్యటన

image

కరీంనగర్‌లో సోమవారం పలు కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు. ఉదయం 10.30గంటలకు శాతవాహన యూనివర్సిటీ సమీపంలో వనమహోత్సవం కార్యక్రమంలో, మధ్యాహ్నం 1:00 గంటలకు సత్యనారాయణ స్వామి దేవాలయం, రాంనగర్‌లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరిగే జగన్నాథుడి రథయాత్ర ప్రారంభిస్తారు.

News July 14, 2024

రేపు హనుమకొండకు మంత్రుల రాక

image

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేపు హనుమకొండకు రానున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ స‌మీకృత జిల్లా కార్యాలయ సమూహం (ఐడీవోసీ)లో రైతు భరోసా పై వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వారితో పాటు మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క పాల్గొననున్నట్లు తెలిపారు.

News July 14, 2024

కల్వకుర్తి: ముగిసిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు..

image

కల్వకుర్తిలోని మినీ స్టేడియంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో 10 ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు ఫుట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గుణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటి బహుమతి MBNR, రెండో బహుమతి నిజామాబాద్, మూడో బహుమతి ఖమ్మం జిల్లా గెలుపొందగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

News July 14, 2024

రామప్ప దేవాలయంలో ఇటలీ దేశస్థులు

image

ఇటలీ దేశానికి చెందిన జెన్నీ, డానియల్‌లు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం సందర్శించారు. నిర్మాణశైలిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నంది విగ్రహం వద్ద ఫోటో తీయించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

News July 14, 2024

బండి సంజయ్‌ని కలిసిన ఆయన క్లాస్‌మేట్స్

image

కరీంనగర్ పట్టణంలోని ఓ హోటల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని ఆయన క్లాస్‌మేట్స్ ఆదివారం కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఎన్నో ఏళ్లు కలిసి చదువుకున్న తమ మిత్రుడు కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండడం చూసి గర్విస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం బీజేపీ అధ్యక్షుడు బండం మల్లారెడ్డి, క్లాస్‌మేట్స్ పాల్గొన్నారు.