India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఆశావహులు ఓటర్ల తలుపు తడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి రెడీ అయిన వారిలో చాలామంది వారం, పది రోజులుగా నల్గొండతో పాటు MLG పట్టణంలోని గల్లీల్లో తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాట పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

సీఎం రూట్ ఉన్న విషయం తెలిసి కూడా జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ యజమాని అక్రమ పార్కింగ్లు చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫ్యాట్ పిజీయన్ పబ్ నిర్వాహకులు సీఎం రూట్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా తమ కస్టమర్లతో వాహనాలను పార్కింగ్ చేయించడంతో సీఎం రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్‌పై బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా..? చూడాలి. బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానం వస్తే DGCA వెబ్‌సైట్‌లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదులకు 18005996969 నంబర్‌కు కాల్ చేయండి.

HYDలో డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వైస్ ఛాన్స్‌లర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిగ్రీ చదువుతున్న 690 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాలు పెంపొందించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

లష్కర్ ప్రాంతంలో నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

HYDలో DGCA రిపోర్టు ప్రకారంగా.. తప్పుడు ఔషధ కంపెనీల పేర్లతో పలు మెడికల్ షాపుల్లో తప్పుడు లేబుల్స్ ఔషధాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. అంతర్రాష్ట్ర నకిలీ మందుల ముఠాలు దీని వెనుక ఉన్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది.

సికింద్రాబాద్ సాధన సమితి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ సీపీ ఈ మేరకు స్పష్టం చేశారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

NZB పూసలగల్లి వాసి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్‌కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ఊరించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు స్పందించకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ యాసంగిలో జిల్లాలో 6.57 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మొండి చేయి చూపించడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో అప్పుల కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.