Telangana

News August 28, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} చుంచుపల్లిలో జాబ్ మేళా
∆} చండ్రుగొండలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం జిల్లా కలెక్టర్ పలు శాఖలపై సమీక్ష
∆} సత్తుపల్లిలో డాక్టర్ దయానంద్ పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ సర్వే
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News August 28, 2024

దక్షిణాఫ్రికాలో పాఠ్య పుస్తకంగా కరీంనగర్ జిల్లా వాసి పుస్తకం

image

కరీంనగర్‌కు చెందిన తెలుగు భాషోద్యమకారుడు, రచయిత కూకట్ల తిరుపతి రాసిన తెలుగు బడి(బాల వాచకం) దక్షిణాఫ్రికాలోని ప్రవాస తెలుగు భారతీయ విద్యార్థులకోసం పాఠ్య పుస్తకంగా ఎంపిక చేసి గత సంవత్సరం నుంచి వినియోగిస్తున్నారు. దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఈ పుస్తకం పాఠ్య పుస్తకంగా ఉంది. శాస్త్రీయ విధానం, సాంకేతికను జోడించి పుస్తకాన్ని రూపకల్పన చేశారు.

News August 28, 2024

HYD: OYO బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరాలు

image

OYOకు వస్తున్న యువతను టార్గెట్ చేసిన ఓ లాడ్జి ఓనర్‌ భాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. హైదరాబాద్ శివారు శంషాబాద్‌ సిటా గ్రాండ్ ఓయో హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. పోలీసుల వివరాలు.. ఒంగోలు వాసి గణేశ్‌ ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. బెడ్‌రూంలోని బల్బ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేశాడు. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు రైడ్స్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News August 28, 2024

HYD: OYO బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరాలు

image

OYOకు వస్తున్న యువతను టార్గెట్ చేసిన ఓ లాడ్జి ఓనర్‌ భాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. హైదరాబాద్ శివారు శంషాబాద్‌ సిటా గ్రాండ్ ఓయో హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. పోలీసుల వివరాలు.. ఒంగోలు వాసి గణేశ్‌ ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. బెడ్‌రూంలోని బల్బ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేశాడు. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు రైడ్స్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News August 28, 2024

భారతదేశంలో అత్యంత ఎత్తు అయిన ఏకాశీల గణపతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ గ్రామంలో భారతదేశంలో ఎత్తైన గణపతి విగ్రహం ఉంది. దాదాపు 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉంది.పశ్చిమ చాళుక్య సామ్రాజ్య నేపథ్యం గురించి ఈ విగ్రహం వర్ణిస్తుంది.ప్రతి రోజు వందలాది మంది భక్తులు ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటారు.ప్రభుత్వం స్పందించి దీనిని పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

News August 28, 2024

మెదక్: అక్రమ నిర్మాణాలు కూల్చేయండి !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల చెరువులు కబ్జాకు గురయ్యాయి. HYDలో హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో ఉమ్మడి జిల్లాలోనూ ఇలాంటి వ్యవస్థను తెచ్చి కబ్జాకు గురైన ప్రాంతాల్లో నిర్మాణాలు కూల్చివేయాలనే డిమాండ్ వస్తుంది. మెదక్‌లోని మల్లెం చెరువు, హెచ్‌ఎండీఏ పరిధిలోని పటాన్‌చెరు, జిన్నారం, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని మండలాల్లోని పలు చెరువులు, ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయి.

News August 28, 2024

హైదరాబాద్ తరహా.. వరంగల్‌లో వాడ్రా.?

image

HYDలో చెరువుల రక్షణ కోసం అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా తరహాలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వాడ్రా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోరం బెటర్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో ‘హైడ్రా లాగే మనకు కావాలి వాడ్రా..’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ వెంకట నారాయణతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

News August 28, 2024

రుణమాఫీపై ఫిర్యాదులు, రంగంలోకి అధికారులు

image

రైతు రుణమాఫీ ఫిర్యాదులపై వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగనున్నారు. ఖమ్మం జిల్లాలో మాఫీ వర్తించని కుటుంబాలను నిర్ధారించే ప్రక్రియ బుధవారం నుంచి చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.2లక్షల లోపు రుణాలు కలిగిన రైతు కుటుంబ సభ్యుల వివరాలను పంట రుణమాఫీ పోర్టల్‌లో అధికారులు నమోదు చేయనున్నారు. జిల్లాలో సుమారు 50వేల కుటుంబాలకు ఇవాల్టి నుంచి నిర్ధారణ ప్రక్రియ మొదలుకానుంది.

News August 28, 2024

HYDలో గణేశుడిని నిలబెట్టేవారికి గుడ్‌న్యూస్

image

వినాయకచవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీస్‌ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పటికే నిర్వాహకులకు ఉన్నతాధికారులు సూచనలు చేశారు. ఈ మేరకు https://policeportal.tspolice.gov.in/indxNew1.htm?‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్గనైజర్లు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలి. అనంతరం సంబంధిత పీఎస్‌లో సంప్రదిస్తే పర్మిషన్‌ ఇచ్చేస్తారు. విగ్రహం ఎత్తు, రూట్ మ్యాప్ తదితర వివరాలను పొందుపర్చండి. ఇప్పుడే అప్లై చేసుకోండి.

News August 28, 2024

పాలమూరులో పేలుళ్ల కలకలం !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ప్రమాదకరమైన జిలెటిన్‌ స్టిక్స్‌ ఉమ్మడి జిల్లాలో క్వారీలు, ప్రాజెక్టుల పనుల్లో ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. భారత్ మాల రోడ్డు నిర్మాణం కోసం గద్వాల జిల్లా గట్టు మండలంలోని గుట్టల్లో నిర్వహిస్తున్న మైనింగ్ పనులను సల్కాపూరం, జోగన్ గట్టు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా పేలుడులో కూలీ మృతితో ఈ విషయం వెలుగులోకి కాగా భయాందోళనకు గురవుతున్నారు.