India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాగర్ జలాలు రాకపోవటం వల్ల ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం సగానికి పైగా తగ్గింది. గతేడాది 2.20లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా ఈసారి 1.02 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అందుకే ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్య కుదించాలని అధికారులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమవగా, భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ రెండో వారంలో డీసీ మొదలయ్యే అవకాశముందని చెబుతున్నారు.
పాలమూరులో స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ BRS, కాంగ్రెస్ పార్టీల MLAలు, మాజీ MLAలు జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికకు వారం రోజుల సమయం ఉండడంతో అంతవరకు ఓటర్లు పార్టీలు మారకుండా ఉండేందుకు వీలుగా క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. ఇలా అయితే అభ్యర్థుల గెలుపు, ఓటములపై ప్రభావం చూపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్..?
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కమిషనరేట్‌లో 63 కేసులు నమోదు చేసి రూ.4.25 కోట్లు పట్టుకున్నారు. ఈ నెల 16న ప్రతిమ హోటల్‌లో పట్టుబడిన రూ.6.67 కోట్లను ఎన్నికల కోడ్ కింద పోలీసులు, IT అధికారులు సీజ్ చేసిన విషయం విదితమే.
నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. లేఖను సహకారశాఖ కమిషనర్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. కాగా తనపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇవ్వలేదు. రాజీనామా లేఖ తమకు అందలేదని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా రేపు అవిశ్వాసం పై ఓటింగ్ జరగనుంది.
*సికింద్రాబాద్: కిషన్ రెడ్డి(BJP) ఖరారు. దానం(INC), పద్మారావు (BRS) అని సమాచారం. *మల్కాజిగిరి: ఈటల(BJP), రాగిడి(BRS) ఖరారు. సునీతా మహేందర్ రెడ్డి(INC) అని సమాచారం. *చేవెళ్ల: కొండా విశ్వేశ్వరరెడ్డి(BJP), కాసాని (BRS) ఖరారు. రంజిత్ రెడ్డి(INC) అని సమాచారం. * హైదరాబాద్: మాధవీలత(BJP), అసదుద్దీన్(MIM) పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఒక్క HYD MP అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది.
*సికింద్రాబాద్: కిషన్ రెడ్డి(BJP) ఖరారు. దానం(INC), పద్మారావు (BRS) అని సమాచారం. *మల్కాజిగిరి: ఈటల(BJP), రాగిడి(BRS) ఖరారు. సునీతా మహేందర్ రెడ్డి(INC) అని సమాచారం. *చేవెళ్ల: కొండా విశ్వేశ్వరరెడ్డి(BJP), కాసాని (BRS) ఖరారు. రంజిత్ రెడ్డి(INC) అని సమాచారం. * హైదరాబాద్: మాధవీలత(BJP), అసదుద్దీన్(MIM) పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఒక్క HYD MP అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది.
ఉమ్మడి నల్గొండ ధాన్యం దారులన్నీమిర్యాలగూడ వైపే వెళ్తున్నాయి. సన్నరకాల కొనుగోలు ఎక్కువగా ఉండడంతో రైతులు అక్కడికి ధాన్యం తరలిస్తున్నారు. ఇక్కడ దాదాపు 115 మిల్లులు ఉండడం, ధర అనుకూలంగా ఉండడంతో రైతులు మిర్యాలగూడకే తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి వరకు, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అటు సాగర్ నుంచి కోదాడ వరకు సాగైన సన్నాలు తరలివస్తున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..BRS నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండటంతో ఆ ప్రభావం నిర్మల్ జిల్లాలో కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విఠల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో కాంగ్రెస్, BJP బలంగా ఉండటంతో ఈ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తి, BRS కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు BRSను వీడనున్నారు.
వరంగల్‌లోని పలువురు వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ టి.కిరణ్‌కుమార్ షోకాజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న నర్సంపేట రోడ్డులోని ఓ గార్డెన్‌లో జరిగిన RMP, PMPల మహాసభలో పలువురు వైద్యులు జాతీయ, రాష్ట్ర వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా వారి అసోసియేషన్‌కు డబ్బులు ఇవ్వడమే కాకుండా, ఆయా ఆసుపత్రుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. వైరా ఎంఈఓ కే.వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు.. అష్ణగుర్తి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎస్‌జీటీ వై.మధుబాబు తన తండ్రి అనారోగ్యానికి గురయ్యారని ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు సెలవు పెట్టారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లినట్లు అందిన సమాచారంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అతణ్ని సస్పెండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.