India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 544.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుండగా ప్రస్తుతం 198.04 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో: 3,27,969 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో: 30,747 క్యూసెక్కులుగా ఉంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మూత్రపిండ వ్యాధిగ్రస్థుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు తయారైంది. వేలాది మంది డయాలసిస్ బాధితులు ఉంటే.. ప్రభుత్వా ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో మాత్రమే పడకలు దర్శనమిస్తున్నాయి. రక్తం శుద్ధి చేసుకునేందుకు రోగులు నిరీక్షిస్తున్నారు. సర్కారు దవాఖానాల్లో మరిన్ని డయాలసిస్ పడకలు అందుబాటులోకి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు.

విద్యార్థులు శిక్షణను సద్వినియోగం
చేసుకుంటూ నైపుణ్యం మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. నగరంలోని ఐటీ హబ్‌ను సందర్శించిన ఆయన కంపెనీల కార్యకలాపాలపై ఆరా తీశారు. అనంతరం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, లెర్నెట్ స్కిల్స్ జనరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫుడ్ అండ్ బేవరేజ్(స్టీవార్డ్) నైపుణ్య శిక్షణ వివరాలు తెలుసుకున్నారు.

బాసర గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం లభించినట్లు గురువారం ఎస్ఐ గణేష్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి వద్ద ఉన్న బ్యాగులో మూడువేల రూపాయల నగదు, బంగారు గొలుసు, మెట్రో ఐడీ కార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూర్ గ్రామ శివారులోని వాగులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించారు. గ్రామస్థులు రూరల్ పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు (50) ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2,900 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ నిర్ణయంతో పదోన్నతి పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి పొందిన 30 వేల మందితో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమావేశం కానున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకెళ్లే వారి కోసం మొత్తం 66 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నోడల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

PU పరిధిలోని బీఈడీ కళాశాలల విద్యార్థులకు ఈ నెల 12 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పీయూ పరీక్షల నియంత్రణ అధికారి డా. రాజ్ కుమార్ తెలిపారు. 2024 ఎడాదికి చెందిన 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులకు ఈనెల 12,14,17 తేదీల్లో, 3వ సెమిస్టర్ బీఈడీ పరీక్షలు 13న, 16న,19 తేదీల్లో, 2వ సెమిస్టర్ బ్యాక్ ల్యాగ్, ఇంప్రూమెంట్ పరీక్షలు 13, 16, 19, 21, 22 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.

ఉమ్మడి WGL వ్యాప్తంగా <<13756149>>డెంగ్యూ<<>>తో పాటు.. వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం చెన్నారావుపేట మండలంలోని ఓ బాలుడు డెంగ్యూతో మృతి చెందగా.. గురువారం నిండు గర్భిణితో పాటు ఆమె కడుపులోని కవల పిల్లలూ మృతి చెందారు. దీంతో జిల్లాలో జ్వరం బారిన పడినవారు MGM బాట పడుతున్నారు. గత వారం రోజులుగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజులో దాదాపు 50-55 మందికి డెంగ్యూ నిర్ధారణవుతోందని వైద్యులు చెబుతున్నారు.

జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ASI లక్ష్మినాయణను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. SI, తోటి సిబ్బందితో లక్ష్మినాయణ దురుసుగా ప్రవర్తించడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు.

హన్మకొండ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి సారంగపాణి తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 3న అండర్ 14, 16, 18, 20 బాల బాలికలు, మహిళ, పురుషులకు జావెలిన్ త్రో, 100 మీటర్ల పరుగు ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న జిల్లా అథ్లెట్లు శనివారం ఉదయం 10 గంటలకు JNS స్టేడియంలో హాజరు కావాలని కోరారు.
Sorry, no posts matched your criteria.