Telangana

News August 28, 2024

HYDలో గణేశుడిని నిలబెట్టేవారికి గుడ్‌న్యూస్

image

వినాయకచవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీస్‌ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పటికే నిర్వాహకులకు ఉన్నతాధికారులు సూచనలు చేశారు. ఈ మేరకు https://policeportal.tspolice.gov.in/indxNew1.htm?‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్గనైజర్లు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలి. అనంతరం సంబంధిత పీఎస్‌లో సంప్రదిస్తే పర్మిషన్‌ ఇచ్చేస్తారు. విగ్రహం ఎత్తు, రూట్ మ్యాప్ తదితర వివరాలను పొందుపర్చండి. ఇప్పుడే అప్లై చేసుకోండి.

News August 28, 2024

నల్గొండ జిల్లాలో ఇదీ పరిస్థితి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల చెరువులు కబ్జాకు గురయ్యాయి. HYDలో హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు తమ దగ్గర కూడా అలాంటి వ్యవస్థను తేవాలని కోరుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని భువనగిరి, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు మండలాల్లో పలు చెరువులు కబ్జాకు గురయ్యాయి.

News August 28, 2024

జైలుకు పంపి నన్ను జగమోండిని చేశారు: MLC కవిత

image

తీహర్ జైలు నుంచి విడుదలైన తర్వాత MLC కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. తనను అనవసరంగా జైలుకు పంపి జగమెుండిని చేశారన్నారు. ‘నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. మెుండిదాన్ని.. మంచిదాన్ని’ అని పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో చెల్లిస్తానని అన్నారు.

News August 28, 2024

సెప్టెంబర్ చివరి వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని భూ క్రమబద్ధీకరణ దరఖాస్తుల మొదటి దశ ధ్రువీకరణ ప్రక్రియ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూ క్రమబద్ధీకరణ 2020 కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు.

News August 28, 2024

ఖైరతాబాద్: వ్యాధి కట్టడికి ఒక కంట్రోల్ రూమ్: మంత్రి

image

సీజనల్ వ్యాధుల కట్టడిపై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. డెంగ్యూ వ్యాధి కట్టడిపై రాష్ట్రస్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.

News August 28, 2024

డెంగ్యూ కట్టడికి అధికారులు అల్టర్‌గా ఉండాలి: మంత్రి రాజనర్సింహ

image

సీజనల్ వ్యాధుల కట్టడిపై సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులు అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజాప్రతినిధులు సంబంధితశాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

News August 28, 2024

44 గేట్లుఎత్తి దిగివకు కృష్ణమ్మ వరద నీరు

image

జూరాల ప్రాజెక్టు ఒక్కరోజులోనే లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి 44 గేట్లుఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతుంది. శ్రీశైలం వైపు ప్రవహిస్తుండడంతో నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 33 గేట్లు తెరువగా.. సాయంత్రం 44 గేట్లుఎత్తి వరద నీటిని వదిలారు.

News August 28, 2024

ALERT: బీ.ఎడ్ రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీలు ఇవే

image

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల ఫీజు వివరాలను పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య. ఎం. అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజును సెప్టెంబర్ 4వ తేది లోపు చెల్లించాలని, 100 రూపాయల అపరాధ రుసుముతో వరకు చెల్లించ వచ్చునని చెప్పారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయ వెబ్ సైట్ ను చూడాలని ఆమె కోరారు.

News August 28, 2024

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు సిబ్బంది పని చేయాలి:SP

image

NLG: ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు అధికారులు సిబ్బంది పని చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

News August 28, 2024

ఆసిఫాబాద్: సిర్పూర్ ఎమ్మెల్యేకు ఆహ్వానం

image

ఆసిఫాబాద్‌లో ఈనెల 29న నిర్వహించే మాజీ మంత్రి స్వర్గీయ కోట్నాక భీంరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ సభ్యులు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబును కోరారు. ఈ మేరకు ఇవాళ కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో గోండ్వాన జాతీయ నాయకులు సిడం అర్జు, మేడి మోతిరాం, సభ్యులు చిన్నయ్య, గుణ్వంతరావ్, తదితరులు ఉన్నారు.