Telangana

News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో దారుణం..!

image

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణ ఘటన వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో బీటె‌క్ చదువుతున్న భార్గవి(19) మృతి చెందింది. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం IBP ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరువు హత్య అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News March 19, 2024

WGL: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ను కొట్టిన ప్రయాణికుడు.. కేసు నమోదు

image

RTC డ్రైవర్, కండక్టర్‌‌పై దాడి చేసిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేసినట్లు SI రాజేష్ తెలిపారు. పోలీసుల ప్రకారం.. BHPL నుంచి HNKకు వెళ్తున్న బస్సు ఆత్మకూరు మండలం కొత్తగట్టు స్టేజీ వద్దకు రాగానే WGLకు చెందిన రాజు డోర్ వద్దకు వచ్చి నిల్చున్నాడు. లోపలికి వెళ్లమని డ్రైవర్ చెప్పినా వినకుండా బూతులు తిట్టి కొట్టాడు. మహిళా కండక్టర్‌పై చేయి చేసుకున్నాడు. డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో దారుణం..!

image

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణ ఘటన వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో బీటె‌క్ చదువుతున్న భార్గవి(19) మృతి చెందింది. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం IBP ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరువు హత్య అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News March 19, 2024

హుజూరాబాద్: ఏటీఎంలో చోరీ.. కేసు నమోదు

image

హుజూరాబాద్ కోర్టుకు ఎదురుగా ఉన్న SBI ATMలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల ప్రకారం.. చోరీ అనంతరం దుండగులు ఏటీఎంను దహనం చేశారు. ఘటనా స్థలానికి సీఐ బొల్లం రమేశ్ చేరుకుని తన సిబ్బందితో వేలిముద్రలను సేకరించారు. కాగా, చోరీ జరిగిన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. రూ.8,64,100 చోరీకి గురైనట్లు సమాచారం. నెట్‌వర్క్ అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News March 19, 2024

MBNR: జిల్లాలో మొత్తం 1,916 పోలింగ్ కేంద్రాలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 1,916 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. కౌంటింగ్ కు పాలమూరు యూనివర్సిటీలో ఏడు హాళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 21 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

News March 19, 2024

NZB: పిల్లలు మృతి.. తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష

image

కన్న పిల్లల మృతికి కారణమైన తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి కుంటాల సునీత తీర్పు వెల్లడించారు. నందిపేటకు చెందిన అమృత 2022 ఫిబ్రవరి 28న గుత్ప కెనాల్‌లో తన పిల్లలను పారేసి తాను దూకింది. ఓ కానిస్టేబుల్ ఆమెను రక్షించగా పిల్లలు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి ఈ మేరకు తీర్పు చెప్పారు.

News March 19, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7,550 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న, ఈ రోజు మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని అధికారులు సూచించారు.

News March 19, 2024

KNR: లంచం అడుగుతున్నారా..? ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

కరీంనగర్ DSP రమణామూర్తి కీలక ప్రకటన చేశారు. లంచం అడిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు 9154388954, 08782243693 నంబర్లను సంప్రదించాలని అన్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News March 19, 2024

MBNR: బలవంతంగా వ్యభిచారంలోకి..

image

యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన HNKజిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఈనెల 10న HYDవచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. కాగా ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వరంగల్ జిల్లా వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

News March 19, 2024

KMM:రైలు కింద పడి యువకుడి బలవన్మరణం

image

చింతకాని మండలం అనంతసాగర్ సమీపంలో మల్లెల కుటుంబరావు (30) అనే వ్యక్తి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంకు చెందిన కుటుంబరావు కొంతకాలంగా అత్తగారి ఊరైన అనంతసాగర్లో నివసిస్తున్నాడు. సోమవారం ఓ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై పారుపల్లి భాస్కర్ రావు తెలిపారు.

error: Content is protected !!