India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య అభివృద్ధి కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు ఆర్జి-3 జిఎం సుధాకర్ రావు, ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు సింగరేణి పరిసర ప్రాంతాల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక నిఘా బృందాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. డబ్బు అక్రమ రవాణా, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేలా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో రెండు, ఖమ్మం జిల్లా పరిధిలో పది అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 15 స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు, 5 అకౌంటింగ్ బృందాలను నియమించారు.
బహుజన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు BRSలో చేరిన సందర్భంగా స్వాగతం పలుకుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRSలో బహుజన నాయకత్వం బలంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కొందరు BRS పార్టీలో లాభం పొంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మండిపడ్డారు.
లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సరిహద్దు లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట నిఘా పెట్టి తనిఖీ చేయాలన్నారు. నగదు మద్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. సీ విజిల్ యాప్ ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు.
ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్, BJP విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో CM రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ MBNR, NGKL స్థానాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిస్తే పాలమూరుకు ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. తాజాగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లో విజయ్ సంకల్ప్ సభలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉంటూ సజావుగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతి ఒక్కరు కృతనిశ్చయంతో అప్రమత్తతో విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.
ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.
ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి, జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించడానికి నోడల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆర్.డి.ఓ.లు, డి.ఎస్పీలు, తహశీల్ధారు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబ్బులు, మద్యం రవాణా కాకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం నిర్వహించిన జిల్లా సిబ్బందితో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన విస్తృత స్థాయిలో కల్పించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.