Telangana

News March 23, 2024

జగిత్యాల: కానిస్టేబుల్ సస్పెండ్

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుదర్శన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో జరిగిన ఓ ఘటనలో బాధితుడి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

News March 23, 2024

నిర్మల్: ఇఫ్తార్ విందులో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు

image

పట్టణంలో కాంగ్రెస్ నేత అర్జుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు.

News March 23, 2024

25న రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

image

భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి. ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు. తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు. అదే రోజు హోలీ కావడంతో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.

News March 23, 2024

MBNR: డీకే అరుణ పూటకో పార్టీ మార్చారు: వంశీచంద్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు పూటకు ఓ పార్టీ మార్చిన చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీకే అరుణ నన్ను ఎమ్మెల్యే చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గద్వాలలో అరుణ కుటుంబపాలన కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తుందని అన్నారు.

News March 23, 2024

వరంగల్: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

image

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మైసంపల్లి గ్రామానికి చెందిన వెంగళ సుప్రియ శనివారం సాయంత్రం ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి ఉన్నట్లు, మృతురాలి మెడలోని బంగారం కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. సుప్రియ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సుప్రియకు భర్త కిరణ్, ఇద్దరు పిల్లలున్నారు.

News March 23, 2024

మాదాపూర్‌లో ముగిసిన ఈడీ సోదాలు

image

HYD మాదాపూర్‌లో ఈడీ సోదాలు ముగిశాయి. ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో శనివారం ఉదయం నుంచి ఈడీ తనిఖీలు చేపట్టింది. 11 గంటల పాటు నిర్విరామంగా వివిధ పత్రాలు పరిశీలించిన ఈడీ అధికారులు.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీశారు. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ భావిస్తోంది.

సికింద్రాబాద్‌లో త్రిముఖ పోరు..!

image

సికింద్రాబాద్ MP బరిలో హేమాహేమీలు నిలిచారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, BRS అభ్యర్థిగా పద్మారావు గౌడ్ నిలిచారు. ముగ్గురికి ముగ్గురు బలమైన నేతలే. ఓటర్ల నాడీ తెలిసిన వారే కావడం విశేషం. సికింద్రాబాద్‌లో రెండోసారి గెలిచి తన సత్తా చాటడానికి కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దానం, పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అనుమతులు లేకుండా ఎరువులను నిల్వ ఉంచిన గోడౌన్ సీజ్?

image

జూలూరుపాడు మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బయో కంపోస్ట్ ఎరువులను నిల్వ ఉంచిన ఓ గోడౌన్ ను శనివారం వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. అక్రమంగా బయో కంపోస్ట్ ఎరువులను నిల్వ ఉంచారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి సంబంధిత గోడౌన్ ను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!