Telangana

News August 27, 2024

SRSP అప్డేట్.. 58.709 TMCలకు చేరిన నీటిమట్టం

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.5TMC)గాను మంగళవారం రాత్రి 7 గంటలకు 1084.6 అడుగులకు (58.709 TMC) నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా 24,014 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోందని ఔట్ ఫ్లోగా 4,459 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు.

News August 27, 2024

కవిత బెయిల్‌పై మంత్రి సంచలన ఆరోపణలు

image

MLC కవితకు బెయిల్ అందరూ ఊహించిందే. BJP, BRSలు కుమ్మక్కై కవితకు బెయిల్ తెచ్చుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో BJP, రాష్ట్రంలో BRS అధికారంలో ఉందని వెల్లడించారు. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు జరగకపోయినా.. రాజకీయ ప్రయోజనాల కోసం BJPకి తెలంగాణను తాకట్టు పెట్టిన పార్టీ BRS అని ఫైర్ అయ్యారు. పదేళ్ల మీ స్నేహబంధం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పారు.

News August 27, 2024

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బోధన: జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ బోధనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పాఠశాలలో అర గంట క్రీడలకు అన్ని తరగతుల వారికి, అరగంట ఇంగ్లీష్ బోధన ఎంపిక చేసిన తరగతుల వారికి తప్పక ప్రతిరోజు కేటాయించాలని పేర్కొన్నారు.

News August 27, 2024

మెదక్ జిల్లా డీఐఈఓగా బాధ్యతలు స్వీకరించిన మాధవి

image

మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్( డీఐఈఓ)గా మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవి మంగళవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ డీఐఈఓగా పనిచేసిన సత్యనారాయణ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. మాధవి మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

News August 27, 2024

మెదక్: ప్రభుత్వ వైద్య కళాశాల పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

మెదక్‌లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. డిపార్ట్మెంటల్ తరగతి గదులు, ల్యాబులు, ప్రయోగశాలలు, వివిధ రకాల వసతి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శివదయాళ్ ఉన్నారు.

News August 27, 2024

నాగర్ కర్నూల్: వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి: ఎస్పీ

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ మాట్లాడారు. వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, మొదలైన సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే ఏ.పి.కె. ఫైల్స్ లింకులను ఓపెన్ చేయవద్దని ప్రజలను కోరారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి లింకులను పంపుతున్నారని, వీటిని ఓపెన్ చేస్తే బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు పోయే ప్రమాదం ఉందన్నారు.

News August 27, 2024

వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ పమేలా

image

బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. చొప్పదండి మున్సిపాలిటీలోని బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో గదులను పరిశీలించారు.

News August 27, 2024

కొండగట్టులో ఇక పార్కింగ్‌కు రుసుం వసూలు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో కొండపై వాహన పార్కింగ్‌కు రుసుము వసూలు చేయనున్నారు. దేవస్థానం కార్యాలయం ముందు గల ఖాళీ స్థలంలో ప్రస్తుతం వాహన పార్కింగ్ చేస్తున్నారు. దేవస్థానం అధికారులు పార్కింగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా అధికారులు పార్కింగ్‌కు రుసుము వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News August 27, 2024

గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సన్నాహక సమావేశం

image

హైదరాబాద్ MCHRHRDలో గణేష్ ఉత్సవాలు – 2024 ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు నాయకులతో కలిసి మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు. హైదారాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, MLA దానం నాగేందర్, డీజీపీ, Spl.CS, హైదరాబాద్ సీపీ, కలెక్టర్, హైద్రాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధిత MLA, MLC ఖైరతాబాద్ గణేశ్ ఇతర గణేష్ ఉత్సవ కమీటీ విశ్వహిందు పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

News August 27, 2024

HYD: తెలుగు వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు

image

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీజీ, యూజీ, డిప్లమా కోర్సులలో ప్రవేశాల గడువు ఈనెల 31వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్టర్ తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన వారందరూ ఈ నెల 31వ తేదీలోగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.