India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ శనివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
@ మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుదర్శన్ సస్పెండ్. @ కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేష్ సస్పెండ్. @ చందుర్తి మండలంలో బస్సు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు. @ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్. @ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ. @ జగిత్యాల జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురి అరెస్ట్.
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈరోజు బెంగళూరు నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి గుణశ్రీ నర్తన గణపతిమ్, రారావేణు, శృంగారలహరి, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించి అలరించారు. HYD వాసి సుభాషిణి గిరిధర్ తన శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో గణేశా, కార్తికేయ, నటేశ కౌతం, కాళీ కౌత్వం, నగుమోము, కాలై థూకి, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈరోజు బెంగళూరు నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి గుణశ్రీ నర్తన గణపతిమ్, రారావేణు, శృంగారలహరి, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించి అలరించారు. HYD వాసి సుభాషిణి గిరిధర్ తన శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో గణేశా, కార్తికేయ, నటేశ కౌతం, కాళీ కౌత్వం, నగుమోము, కాలై థూకి, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
✔డీకే అరుణ పూటకో పార్టీ మార్చారు:వంశీచంద్ రెడ్డి
✔అయిజ:ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి
✔NGKL:క్షయవ్యాధి నివారణకు సమీక్ష
✔ఉమ్మడి జిల్లాలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సాయుధ బలగాలతో కవాతు
✔NRPT:చెక్ పోస్ట్ తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలి:DSP
✔NRPT,GDWL:రేపు పలు గ్రామాలలో కరెంటు కట్
✔పాలమూరు అభివృద్ధికి ప్రణాళికలతో ఉన్నా:డీకే అరుణ
✔బెల్ట్ షాపులపై ఫోకస్
BRS పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా చేశారు. శనివారం రాజీనామా లేఖను బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు పంపారు. నల్గొండ పార్లమెంటు స్థానాన్ని ఆశించిన తేరా చిన్నపురెడ్డికి నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కేటాయించకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు.
> MHBD ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా సుజాత
> > జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
> > సీఎం రేవంత్‌ను కలిసిన పాలకుర్తి MLA
> > HNK: బాలికపై లైంగికదాడికి యత్నం.. సీఐ సస్పెండ్
> > గాంధీభవన్ వద్ద దేవరుప్పుల కాంగ్రెస్ నాయకుల నిరసన
> దుగ్గొండి: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
> > ములుగు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సీతక్క
> ములుగు: వదంతులు సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుదర్శన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో జరిగిన ఓ ఘటనలో బాధితుడి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
పట్టణంలో కాంగ్రెస్ నేత అర్జుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు.
భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి. ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు. తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు. అదే రోజు హోలీ కావడంతో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.
Sorry, no posts matched your criteria.