India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు పూటకు ఓ పార్టీ మార్చిన చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీకే అరుణ నన్ను ఎమ్మెల్యే చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గద్వాలలో అరుణ కుటుంబపాలన కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తుందని అన్నారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మైసంపల్లి గ్రామానికి చెందిన వెంగళ సుప్రియ శనివారం సాయంత్రం ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి ఉన్నట్లు, మృతురాలి మెడలోని బంగారం కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. సుప్రియ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సుప్రియకు భర్త కిరణ్, ఇద్దరు పిల్లలున్నారు.
HYD మాదాపూర్‌లో ఈడీ సోదాలు ముగిశాయి. ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో శనివారం ఉదయం నుంచి ఈడీ తనిఖీలు చేపట్టింది. 11 గంటల పాటు నిర్విరామంగా వివిధ పత్రాలు పరిశీలించిన ఈడీ అధికారులు.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీశారు. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ భావిస్తోంది.

సికింద్రాబాద్ MP బరిలో హేమాహేమీలు నిలిచారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, BRS అభ్యర్థిగా పద్మారావు గౌడ్ నిలిచారు. ముగ్గురికి ముగ్గురు బలమైన నేతలే. ఓటర్ల నాడీ తెలిసిన వారే కావడం విశేషం. సికింద్రాబాద్‌లో రెండోసారి గెలిచి తన సత్తా చాటడానికి కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దానం, పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

జూలూరుపాడు మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బయో కంపోస్ట్ ఎరువులను నిల్వ ఉంచిన ఓ గోడౌన్ ను శనివారం వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. అక్రమంగా బయో కంపోస్ట్ ఎరువులను నిల్వ ఉంచారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి సంబంధిత గోడౌన్ ను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం ఈవో వెంకటేశంను సస్పెండ్ చేస్తూ శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు టెండర్ల సొమ్ము గోల్ మాల్ విషయంలో ఇటీవల విచారణ చేపట్టారు. ఈ విషయంలో పలువురు ఉద్యోగులకు మెమోలు జారీ చేయగా, పర్యవేక్షణ లోపం (విధుల పట్ల నిర్లక్ష్యం) కారణంగా ఈఓ సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో ACB దాడుల్లో వరుసగా ప్రభుత్వాధికారులు పట్టుబడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ACB DG సీవీ ఆనంద్ ప్రస్తుతం తన ఉద్యోగాన్ని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు. దీనికి సీవీ ఆనంద్ స్పందిస్తూ.. “తప్పు చేసిన అధికారులను పట్టుకుని జైలుకు పంపడం అత్యంత కఠినమైన జాబ్. ప్రభుత్వాధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

Sorry, no posts matched your criteria.