Telangana

News March 24, 2024

కడెం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…!

image

కడెం మండలం పెద్దూర్ గ్రామ సమీపంలోని గిరిజన వసతిగృహం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దూరుకు చెందిన కత్తె రాపాక గంగన్న(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఖానాపూర్ ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మరణించినట్లు బంధువుల తెలిపారు. సైకిల్ పై కడెం నుంచి పెద్దూరుకు వెళ్తున్న గంగన్నను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహన చోదకుడికి గాయాలైనట్లు సమాచారం.

News March 24, 2024

పంట దిగుబడులపై రైతన్నల దిగాలు!

image

యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు గుబులు పట్టుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో నానాటికీ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ ప్రభావం బోర్లు, బావుల కింద సాగు చేసిన పంటలపై పడింది. సాగు చేసిన పంటల్లో చాలావరకు ఇప్పటికే ఎండిపోగా… మిగతావి వడబడుతున్నాయి . పెట్టుబడి వచ్చే స్థాయిలోనూ దిగుబడి సాధించే పరిస్థితి కానరావడం లేదు. వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న ఎండిపోగా రైతులకు కన్నీరే మిగులుతోంది.

News March 24, 2024

NLG: ప్రయాణికుల కనీస సౌకర్యాలు పట్టని ఆర్టీసీ

image

ఉమ్మడి జిల్లాలో RTC బస్సుల్లో ప్రయాణించే వారికి భద్రతతోపాటు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్లలో తాగునీరు, బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సులు కనిపించని పరిస్థితి నెలకొంది. బస్సుల్లో ప్రయాణించే వారి టికెట్ పై పల్లె వెలుగుల్లో రూ.2, ఇతర బస్సుల్లో రూ.6 చొప్పున సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సమకూరుతున్నా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు, భద్రత కల్పించడం లేదు.

News March 24, 2024

ADB: మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ

image

కాలినడకన వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్ళిన సంఘటన శనివారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ స్ధానిక పంజాబ్ చౌక్ వద్ద బస్సు దిగి భూక్తాపూర్‌లోని బంధువుల ఇంటికి కాలినడకన వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అగంతకుడు అకస్మాత్తుగా రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News March 24, 2024

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి

image

జిల్లా వ్యాప్తంగా నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. డొంకేశ్వర్‌కు చెందిన పెద్ద గంగారం (44) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. నందిపేటలోని తల్వేద వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి బండారి రవి(20) అనే వ్యక్తి నీట మునిగి మృత్యవాతపడ్డాడు. నవీపేటకి చెందిన మోసిన్ (13) అలీసాగర్ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టగా మోసిన్ మృతదేహం లభ్యమైంది.

News March 24, 2024

అర్ధరాత్రి చలో చార్మినార్!

image

రంజాన్‌ సందడి మొదలుకావడంతో ఓల్డ్ సిటీ కిక్కిరిసిపోతోంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రి జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్‌ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు చలో చార్మినార్‌ అంటున్నారు. HYD వాసులే కాదు శివారు ప్రాంతాలతోపాటు నగరానికి వచ్చిన వారు, విదేశీయులు రంజాన్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

News March 24, 2024

అర్ధరాత్రి చలో చార్మినార్!

image

రంజాన్‌ సందడి మొదలుకావడంతో ఓల్డ్ సిటీ కిక్కిరిసిపోతోంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రి జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్‌ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు చలో చార్మినార్‌ అంటున్నారు. HYD వాసులే కాదు శివారు ప్రాంతాలతోపాటు నగరానికి వచ్చిన వారు, విదేశీయులు రంజాన్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

News March 24, 2024

మంత్రి పొన్నం ఆత్మ గౌరవ స్టార్: వొడితల ప్రణవ్ 

image

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశం స్టార్ కాదని.. ఆత్మగౌరవ స్టార్ అని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వోడితల ప్రణవ్ తెలిపారు. ఆత్మగౌరవ స్టార్ కాబట్టే.. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. మంత్రిని భర్తరఫ్ చేయించే అర్హత, విమర్శించే స్థాయి కౌశిక్‌కు ఉందా అని ప్రశ్నించారు. మంత్రిని పట్టుకొని పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తారా..? అలా మాట్లాడడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమన్నారు.

News March 24, 2024

పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి డీఈవో లేఖ

image

వరంగల్ నగరంలోని కరీమాబాద్ SRR తోట ప్రాంతంలో ఉన్న వాణి విద్యానికేతన్ స్కూల్‌పై వివిధ విద్యార్థి సంఘాలు వినతి పత్రం సమర్పించడంతో డీఈవో వాసంతి స్పందించారు. శనివారం ఆర్జేడీకి ప్రొసీడింగ్ లేఖ పంపించారు. ఒక పర్మిషన్ మీద రెండు బ్రాంచీలు నడిపిస్తున్న వాణి విద్యానికేతన్ పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి పంపించారు. ఈ మేరకు AIFDS వామపక్ష విద్యార్థి సంఘాలు డీఈఓకు కృతజ్ఞతలు తెలిపాయి.

News March 24, 2024

కూసుమంచి , ఖమ్మం మీదుగా కొత్త రైల్వే లైన్

image

డోర్నకల్‌ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల వరకు నూతనంగా రైల్వేలైన్‌ మంజూరు కాగా.. నిర్మాణానికి సర్వే పూర్తికావడంతో మార్కింగ్‌ ఇస్తున్నారు. ఈ రైల్వేలైన్‌ పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మార్కింగ్‌ చేస్తుండగా తాము భూములు కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!