India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డే కు చిట్టాపూర్ వచ్చాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్ళాడు. శివకుమార్‌కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
హోలీ సందర్భంగా సమ్మతి లేకుండా రంగులు చల్లడాన్ని, వీధులు, వాహనాలపై గుంపులుగా సంచరించడాన్ని నిషేధిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ ఆదేశాలిచ్చారు. ఈ నిబంధనలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. అంతేగాకుండా నేడు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని చెప్పారు.
ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. >>>SHARE IT
పంట దిగుబడులు రాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహాత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మన్నూరు గ్రామానికి చెందిన రైతు జాదవ్ రాజారాం (56) 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. రబీలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల దిగుబడి రాక మనస్తాపానికి గురైన రాజారాం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బావిలో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. దేవేందర్ గౌడ్, జయలక్ష్మి దంపతుల కుమారుడు భూపతి గౌడ్(17) ఇంటర్ పరీక్షలు ముగియగా.. ఖాళీగా ఉన్నాడు. ఓ బావిలో ఈత కొడుతుండగా.. పూడికలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
పూజలు చేస్తానని నమ్మించి ఓ మహిళను హత్య చేసిన దొంగ బాబా నర్సింగ్ రామ్ అలియాస్ శివను జిన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరన్నగూడెంకు చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేస్తానని నమ్మించి ఘట్‌కేసర్ పరిధిలోని మాదారం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బంగారు గొలుసు కోసం బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. శివపై పలు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} భద్రాచలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. 2022లో జిల్లాలో క్షయ బాధితులు 7,187 మంది ఉండగా.. 2024లో ఇప్పటి వరకు 8,612 మంది రోగులు నమోదయ్యారు. ఒక్క ఏడాదిలోనే వారి సంఖ్య 1,425 మంది పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో 80 శాతం కేసులు వస్తుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 20 శాతం మంది చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 క్షయ యూనిట్ల ఆసుపత్రులు ఉన్నాయి.
కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఘటనపై బూర్గంపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి ఈనెల 11న కులాంతర వివాహం చేసుకుంది. ఈ క్రమంలో యువతి తండ్రి కుమార్తెను చూడడానికి వెళ్లి ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న బ్లేడుతో దాడి చేశాడు. గాయపడిన బాధితురాలు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.