India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేములవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి ఎస్పీ అఖిల్ మహాజన్ అటాచ్ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్‌లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
ఈనెల 23 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మూడవ సంవత్సరం ఐదవ సెమిస్టర్ B.SC ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి ఆడెపు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ప్రయోగ పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరలా 1.గంట నుంచి నాలుగు గంటల వరకు జరుగుతాయని విద్యార్థులు తప్పక హాజరుకావాలని సూచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో BRS పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, పురపాలిక చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, MPTCలు BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగం అందుకున్నట్లు తెలుస్తోంది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది. దీంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కాపాడుకునేందుకు నేతలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే వివిధ మండలాల నుంచి ఓటర్లను క్యాంప్‌కు తీసుకెళ్లగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారని సమాచారం.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తుంది. కాగా భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసిఆర్‌తో ఉన్న బోర్డును తొలగించి, ఆయన ఒక్కరే ఉన్న ఫోటో ఫ్లెక్సీ బోర్డును అమర్చారు. బోర్డు మార్పుతో పార్టీ చేరిక ఖరారు అయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని రెండుసార్లు కలిశారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గురువారం (నిన్న) క్వింటా పత్తికి రూ.7,315 ధర రాగా.. ఈరోజు (శుక్రవారం) రూ.7250 కి పడిపోయింది. ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. రేపటినుండి మార్కెట్ కు వరుసగా మూడు రోజుల వరుస సెలవులు నేపథ్యంలో ఈరోజు పత్తి తరలివచ్చింది.
ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నెకు చెందిన మౌనిక, మల్దకంటి దంపతుల బాబు జాన్సన్ లివర్ ప్రాబ్లంతో బాధ పడుతున్నాడు. వైద్యానికి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితి ఉన్నారు. వారి పెద్ద కుమార్తె లివర్ వ్యాధి బారినపడి మృతి చెందింది. మౌనికకు రెండు వారాల క్రితం పుట్టిన చిన్నారికి సైతం అదే సమస్య ఉంది. లివర్ మార్చితే బతికే అవకాశ ఉందని.. ఆర్థిక సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితను ఈడీ కేసులో రిమాండ్‌కు పంపాయని ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు అభ్యర్థులు లేరని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా యువతకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వరంగల్‌లో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. హెచ్‌సీఏ నిర్ణయంపై వరంగల్ జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1950లో ఖమ్మం జిల్లాలో జన్మించిన మల్లు రవి ఎంబీబీఎస్, డీఎల్వో చదివారు. భార్య రాజబన్సిదేవి , కుమార్తె అనంత శృతి, కుమారుడు సిద్దార్ధ. 1991, 1998లో రెండుసార్లు నాగర్ కర్నూల్ నుంచి MPగా గెలిచారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, అనంతరం దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.