Telangana

News August 27, 2024

భద్రాచలం: 28 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 27 అడుగుల వద్ద ఉన్న నీటి ప్రవాహం మంగళవారం ఉదయం 10 గంటలకు 28 అడుగులకు చేరుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి గోదావరి 30 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి అధికారులు పేర్కొన్నారు.

News August 27, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా గనపూర్‌లో 15.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో 13.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా రాజోలిలో 12.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 9.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడలో 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 27, 2024

MBNR: ‘ఎస్బీఐ ఆధ్వర్యంలో యువతకు ఉచిత శిక్షణ’

image

ఉమ్మడి జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతకు ఎస్బీఐ ఆధ్వర్యంలో ఏసీ రిపేరింగ్ ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నామని ఆఫీస్ అసిస్టెంట్ చెన్నకేశవులు మంగళవారం తెలిపారు. 19-45 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 6 వరకు బండమీదిపల్లిలోని స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 9 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని చెప్పారు.

News August 27, 2024

ఉమ్మడి నల్గొండలో గృహజ్యోతి పరిస్థితి ఇదీ

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం గృహ విద్యుత్తు కనెక్షన్లు 13,85,385 ఉన్నాయి. 8,78,360 కనెక్షన్లకు సున్నా బిల్లులు వస్తుండగా, 5,07,025 కనెక్షన్ల లబ్ధిదారులు పథకం ఫలాలు పొందటం లేదు. వాణిజ్య కనెక్షన్లు మినహా కొంతమంది బిల్లులు చెల్లిస్తున్నారు. దరఖాస్తుల సవరణకు ప్రభుత్వం పురపాలికలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏడు నెలలుగా గృహజ్యోతికి సంబంధించిన సైట్ తెరుచుకోలేదు.

News August 27, 2024

ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా?: కేటీఆర్

image

కాక‌తీయ కళా‌తో‌రణం చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సిరిసిల్ల MLA కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో తెలుసుకొని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News August 27, 2024

ఖమ్మం: దిగొచ్చిన కూరగాయల ధరలు

image

ఖమ్మం జిల్లాలో రెండు నెలల కిందటి వరకు భగ్గుమన్న కూరగాయలు ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులపై ప్రభావం చూపాయి. ఏ రకం కొనుగోలు చేయాలన్న కిలో రూ.40పైనే. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉండడంతో అన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరగడంతో ధరలు తక్కువ ముఖం పట్టాయి. గత నెలలో టమాట రూ.68 ఉండగా ప్రస్తుతం రూ.29 రూపాయలకు చేరింది. కాకరకాయ రూ.58 రూపాయలు ఉండగా నేడు రూ.24 లభిస్తున్నాయి.

News August 27, 2024

బాన్సువాడ: ‘సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడు’

image

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, డ్యూటీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు శంకర్, కృష్ణవేణి ఆరోపించారు. సోమవారం జ్వరంతో ఉన్న తమ కుమారుడు హేమంత్ (3)ను ఆసుపత్రికి తీసుకొచ్చామన్నారు. రాత్రి హేమంత్ ఏడుస్తున్నాడని సిబ్బందికి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో మంగళవారం ఉదయం తమ కుమారుడు మృతి చెందాడని వారు తెలిపారు.

News August 27, 2024

ఊట్కూర్: ‘ఆస్పత్రికి అని వెళ్లి.. తిరిగి రాలేదు’

image

వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన తన భర్త తిరిగి ఇంటికి రాలేదని అతడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. SI కృష్ణంరాజు కథనం.. ధరూర్ మం. ర్యాలంపాడుకు చెందిన లోకేశ్వర్ రెడ్డి(32)కి ఆరేళ్ల క్రితం ఉట్కూర్‌కు చెందిన జ్యోతితో పెళ్లి కాగా ఇక్కడే ఉంటున్నారు. ఈనెల 23న చికిత్స కోసం MBNRలోని ఆసుపత్రికి వెళ్లిన అతడి తిరిగి ఇంటికి రాలేదు. అతడి ఆచూకీ లేకపోవడంతో జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News August 27, 2024

‘వయ్యారిభామ కలుపు నివారణకు సస్యరక్షణ చర్యలు’

image

వయ్యారిభామ కలుపు మొక్క చాలా ప్రమాదకరమైనదని, పంటలు, కాల్వల్లో, బహిర్గత ప్రాంతాల్లో ఎక్కవగా విస్తరించి అధిక నష్టాన్ని కలుగజేస్తుందని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త డా. రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ మొక్క నివారణకు చర్యలు, తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ మొక్క ఎక్కువ విషప్రభావం కల్గి మనుషులు, పశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వర్షాకాలంలో పూతరాక ముందే దీనిని తొలగించాలన్నారు.

News August 27, 2024

ఖమ్మం: ఎకరానికి రూ.7,500 ఎప్పుడు?

image

ఎన్నికలకు ముందు రైతుభరోసా కింద
ఎకరానికి రూ.7,500 చొప్పున.. రెండు సీజన్లకు కలిపి రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండటంతో రైతు భరోసా ఇంకెప్పుడిస్తారని రైతన్నలు ఎదురుస్తున్నారు. ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని సర్కార్ చూస్తోంది. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది రైతులు, భద్రాద్రిలో 1.70 లక్షల మంది ఉన్నారు.