Telangana

News March 22, 2024

NZB: మహిళ హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష

image

మహిళను కిరాతకంగా హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు 14 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల శుక్రవారం తీర్పు చెప్పారు. ఆర్మూర్ శివారులోని మామిడిపల్లిలో ఒంటరిగా నివాసం ఉండే బొణికే భారతి (55)ను 2018లో తోకల చిత్ర, బట్టు వెంకటేష్, పందిర్ల రాజేందర్ గౌడ్, బట్టు రంజిత్ గొంతు కోసి హత్య చేసిన అభియోగాలు నిర్దారణ కావడంతో జిల్లా జడ్జిపై మేరకు తీర్పు చెప్పారు.

News March 22, 2024

ధర్మపురి: కారును ఢీ కొట్టిన లారీ.. తప్పిన ప్రమాదం

image

కారును లారీ వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం లక్షెట్టిపేట నుంచి జగిత్యాలకు బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం ఓ ఫ్యామిలీ కారులో వెళుతుండగా ధర్మపురి వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

News March 22, 2024

ఖమ్మం లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి.!

image

ఖమ్మం లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖరారు అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా లోకసభ టికెట్ ను ఆశిస్తున్న పలువురికి అధిష్ఠానం నచ్చజెప్పి ప్రసాద్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం నిర్ణయానికి పోటీలో ఉన్న మరో ఇద్దరు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా ఖమ్మం అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

News March 22, 2024

డిండి: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

image

మహిళ గొంతు కోసి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారంకోర్టులో హాజరుపరిచినట్టు దేవరకొండ DSP గిరిబాబు తెలిపారు. డబ్బుల విషయంలో జరిగిన గొడవలో డిండి మండలానికి చెందిన శ్రీలతను ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం సిద్ధనపాలెంకి చెందిన బొమ్మనబోయిన సాంబయ్య ఈనెల 14న మద్యం మత్తులో హత్య చేశాడన్నారు. మృతురాలి తమ్ముడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.

News March 22, 2024

ALP: నాకు కోర్టు నోటీసులు రాలేదు: ఎమ్మెల్యే విజయుడు

image

హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో తన ఎన్నిక చెల్లదని హైకోర్టు నోటీసులు పంపింది అంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. తాను చేసింది తాత్కాలిక ఉద్యోగం అని, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదని గ్రహించాలని హితవు పలికారు.

News March 22, 2024

జగిత్యాల: ఓవర్ లోడు సాకుతో మహిళను దింపిన RTC కండక్టర్

image

మహిళా ప్రయాణికులను ఆర్టీసీ బస్సు నుంచి దింపేసిన ఘటన జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే చివరి బస్సులో ఓవర్ లోడు, టికెట్లు ఇచ్చే మిషన్‌లో ఛార్జింగ్ లేదని మెషిన్ నుంచి టికెట్లు రావడం లేదన్న సాకుతో రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో 10 మంది మహిళలను ఆర్టీసీ కండక్టర్ దింపినట్లు మహిళలు తెలిపారు. రాత్రి వేళ అని మహిళలు బతిమిలాడడంతో బస్సులో ఎక్కించుకున్నారు.

News March 22, 2024

MNCL: విద్యార్థిని మృతికి కారణమైన ప్రిన్సిపల్‌ను తొలగించాలి: శ్రీనివాస్

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకులలో విద్యార్థిని మృతికి కారణమైన ప్రిన్సిపల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని అనారోగ్యానికి గురైనా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

News March 22, 2024

అనుముల: ‘చేరికల కోసం కాదు.. రైతుల నీళ్లు కోసం గేట్లు ఎత్తండి’

image

కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లనే రైతులు రోడ్డు మీద పడ్డారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. అనుముల మండలం కొట్టాల, చలమారెడ్డిగూడెం గ్రామాలలో ఎండిన పంట పొలాలను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రమావత్ రవీంద్ర కుమార్ తో కలిసి పరిశీలించారు. పార్టీలో చేరికల కోసం గేట్లు ఎత్తడం కాదు.. ముందు నాగార్జునసాగర్ గేట్లెత్తి రైతులకు నీళ్లు ఇవ్వండని అన్నారు.

News March 22, 2024

మెదక్: బాల్య వివాహం అడ్డగింత

image

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో ఓ బాలిక వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. 15 ఏళ్ల వయసు గల బాలిక వివాహం గ్రామంలో జరుగుతుందన్న సమాచారం మేరకు ఐసీడీఎస్ సీడీపీఓ కరుణ శీల, సూపర్వైజర్ సంతోష, కొల్చారం పోలీసుల సహాయంతో గ్రామానికి చేరుకొని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. సదరు బాలికను మెదక్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.

News March 22, 2024

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి హైకోర్టు నోటీసులు

image

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఈరోజు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, వారిపై వేర్వేరుగా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా ఈరోజు విచారించిన కోర్టు ఆ మేరకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

error: Content is protected !!