India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
GHMC మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమెతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో BRS 56 స్థానాలు గెలుచుకోగా.. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే 10 మంది పార్టీని వీడారు. మరో 15 మంది కార్పొరేటర్లను ఆకర్షించాలని INC భావిస్తోందట. ఇదిలా ఉంటే ఒక్కొక్కరుగా పార్టీని వీడడం HYD BRSలో అలజడి రేపుతోంది.
GHMC మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమెతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో BRS 56 స్థానాలు గెలుచుకోగా.. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే 10 మంది పార్టీని వీడారు. మరో 15 మంది కార్పొరేటర్లను ఆకర్షించాలని INC భావిస్తోందట. ఇదిలా ఉంటే ఒక్కొక్కరుగా పార్టీని వీడడం HYD BRSలో అలజడి రేపుతోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకుల డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్ తెలిపారు. మణుగూరులోని బాలుర డిగ్రీ కళాశాలతో పాటు కొత్తగూడెం, దమ్మపేట, ఖమ్మం బాలికల కళాశాలల్లో చేరేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు.
మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని నిలదీయగా ఓ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఘటన మట్టెవాడ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. MGMలో చికిత్స కోసం ఓ మహిళ వచ్చింది. తోటి మహిళలతో MGM బస్టాప్ సమీపంలోకి రాగా.. రంగంపేటకు చెందిన విజయ్ కుమార్ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న ఎస్ పీఎఫ్ కమలాకర్ అతణ్ని అడ్డుకొని వారించాడు. దీంతో విజయ్ కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేశాడు.
ఖమ్మం జిల్లాలో ఎండలు దంచుతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. వేసవిలో తాగునీటి కోసం మట్టి కుండలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సైతం సూచిస్తుండంతో పేద, ధనిక తేడా లేకుండా వీటిని కొంటున్నారు. సైజును బట్టి రూ.80 నుంచి రూ.300 వరకు ధరలు పలుకుతున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు.
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానాల బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మహబూబ్ నగర్ స్థానానికి మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), డీకే అరుణ(BJP) పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూల్ స్థానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS), మల్లు రవి(కాంగ్రెస్), పి.భరత్ ప్రసాద్(BJP) బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు.
రెండు రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించగా.. కాంగ్రెస్, BJP పెండింగ్లో ఉంచాయి. అయితే BJP అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బరిలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి KNR జిల్లా వాసులను ఉష్ణోగ్రతలు కలవరపెడుతున్నాయి. గత రెండేళ్లుగా వేసవిలో రాష్ట్ర స్థాయి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రాంతాలే ఉన్నాయి. గత వర్షాకాలంలోనూ సాధారణం కంటే 27% అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. ఇదే తరహాలో జిల్లాలో ఇటీవల వరదలు రావడం, పిడుగులు, రాళ్లవానలు తదితరాలు సంభవించాయి. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి శివారులో మేకలను దొంగలించేందుకు ప్రయత్నించిన భీమ్ రావు, మధు అనే ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకున్నారు. డమ్మీ తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిన ఇద్దరు యువకులు బైక్‌పై నుంచి కింద పడటంతో గాయాలయ్యాయి. దొంగలను ఆస్పత్రికి తరలించిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భీంగల్‌కు చెందిన సంపంగి లక్ష్మి, ఆమెతో సహజీవనం చేస్తున్న సుంకరి శంకర్ ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సహకరిస్తున్న లాడ్జి ఓనర్ నరసింహరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరణ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.