India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీపై అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా సహకార సంఘాల పరిధిలోని డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల్లో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఎట్టకేలకు రుణమాఫీపై కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను బుధవారం ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన సందర్భంగా మల్లన్నను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా జానంపేటలో 25.5 మి.మీ, వనపర్తి జిల్లా రేవల్లిలో 17.3 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్లో 13.8 మి.మీ, గద్వాల జిల్లా మల్లాపూర్ 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ కళ్యాణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఓయూలో పరీక్షను వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు. గ్రూప్-2, గ్రూప్-3 ఒకే సిలబస్ కనుక ఈ రెండు పరీక్షలను ఒక 15 రోజుల వ్యవధిలో డిసెంబర్‌లో నిర్వహించాలని అన్నారు. లేనిపక్షంలో 10 వేల మంది గ్రూప్-2 అభ్యర్థులతో టీజీపీఎస్సీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్‌లోని పరిశ్రమ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాఘవరెడ్డిని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామ స్టేజి వద్ద విజయవాడ-హైదరాబాద్ వెళ్తున్న భారీ కంటైనర్‌ని దాటిన కారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై అడ్డంగా ఉన్న కంటైనర్‌ను క్రేన్ సాయంతో పక్కకు తీసేశారు.

అత్తింటి వేధింపులు తాళలేక నిజామాబాద్ ఆర్యనగర్‌కు చెందిన వివాహిత యువతి లావణ్య(23) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్యకు తొమ్మిది నెలల కిందట ఆర్యనగర్‌కు చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిగింది. ఆషాఢం కావడంతో సుభాష్ నగర్‌లోని తన పుట్టింటికి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన NGKL జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీరయ్య, రాజు అన్నదమ్ములు. రాత్రి బీరయ్య నడుచుకుంటూ వెళ్తుండగా రాజు పెంపుడు కుక్క అరిచింది. భయంతో బీరయ్య రాయితో కొట్టాడు. కుక్కని కొట్టాడని అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈక్రమంలో మనస్తాపంతో ఉరేసుకుని రాజు ఆత్మహత్యకు చేసుకున్నాడు.

ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన పనిలేదు అని ఇకపై ఫోన్‌ఫే , గూగుల్ ఫే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర చెల్లింపు విధానాలతో ప్రయాణికులకు టికెట్లు జారీ చేయనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోందన్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన నితిన్ కాలేజీ ఫీజు కోసం రూ.1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌లో పోగొట్టాడు. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.