Telangana

News August 27, 2024

‘వయ్యారిభామ కలుపు నివారణకు సస్యరక్షణ చర్యలు’

image

వయ్యారిభామ కలుపు మొక్క చాలా ప్రమాదకరమైనదని, పంటలు, కాల్వల్లో, బహిర్గత ప్రాంతాల్లో ఎక్కవగా విస్తరించి అధిక నష్టాన్ని కలుగజేస్తుందని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త డా. రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ మొక్క నివారణకు చర్యలు, తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ మొక్క ఎక్కువ విషప్రభావం కల్గి మనుషులు, పశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వర్షాకాలంలో పూతరాక ముందే దీనిని తొలగించాలన్నారు.

News August 27, 2024

ఖమ్మం: ఎకరానికి రూ.7,500 ఎప్పుడు?

image

ఎన్నికలకు ముందు రైతుభరోసా కింద
ఎకరానికి రూ.7,500 చొప్పున.. రెండు సీజన్లకు కలిపి రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండటంతో రైతు భరోసా ఇంకెప్పుడిస్తారని రైతన్నలు ఎదురుస్తున్నారు. ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని సర్కార్ చూస్తోంది. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది రైతులు, భద్రాద్రిలో 1.70 లక్షల మంది ఉన్నారు.

News August 27, 2024

కేసముద్రం: కోడలే కొడుకై.. మామకు తలకొరివి పెట్టింది!

image

ఆఖరి మజిలీలో ఆ వృద్ధుడికి కొడుకు లేని లోటును కోడలు తీర్చింది. మామకు ఇచ్చిన మాట ప్రకారం తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య(90) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. గతంలో వెంకటయ్య ఇద్దరు కుమారులు అనారోగ్యంతో చనిపోవడంతో పెద్ద కోడలు యాకమ్మ మామ వెంకటయ్యకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది.

News August 27, 2024

హైదరాబాద్‌‌లో ఇవి పూర్తి చేయండి: KTR

image

HYDలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం SRDP ప్రాజెక్ట్‌‌ను తీసుకొచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 42 ప్రాజెక్టులను ప్రారంభించి, 36 విజయవంతంగా పూర్తి చేసింది. మిగిలిన ప్రాజెక్టులను 2024లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని పూర్తి చేయండి’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.

News August 27, 2024

హైదరాబాద్‌‌లో ఇవి పూర్తి చేయండి: KTR

image

HYDలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం SRDP ప్రాజెక్ట్‌‌ను తీసుకొచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 42 ప్రాజెక్టులను ప్రారంభించి, 36 విజయవంతంగా పూర్తి చేసింది. మిగిలిన ప్రాజెక్టులను 2024లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని పూర్తి చేయండి’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.

News August 27, 2024

రెండు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు

image

సాగర్ జలాశయానికి సోమవారం రాత్రి ఒకేసారి 1,07,241 క్యూసెక్కుల వరదనీరు రావడంతో రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను 5అడుగులు ఎత్తి దిగువకు 16,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాత్రి 11గంటలకు 65,335 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదన ద్వారా 29151, కుడి, ఎడమ కాల్వల ద్వారా 17,584, AMRP ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News August 27, 2024

సదాశివ‌నగర్‌లో డెంగ్యూతో ఎవరూ మృతి చెందలేదు: వైద్యాధికారి

image

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగ్యూతో ఎవరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల రన్విత్ (9), మాన్విశ్రీ (12)లకు తీవ్ర జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కాగా వారికి మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంతోనే చనిపోయారని ఆయన స్పష్టం చేశారు. సదాశివనగర్‌కు చెందిన నరేశ్ షుగర్ సమస్యతో మృతి చెందాడని ఆయన పేర్కొన్నారు.

News August 27, 2024

సంగారెడ్డి: ప్రజాపాలన దరఖాస్తు సవరణలకు అవకాశం

image

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులో సవరణలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అర్హత ఉండి ఈ పథకాలను పొందలేకపోతున్న వారు మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఉన్న ప్రజాపాలన సేవ కేంద్రాలు ద్వారా సవరణలు చేసుకోవచ్చు. ప్రస్తుతం సంగారెడ్డి కలెక్టరేట్లోనూ ప్రజాపాలన సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. SHARE IT..

News August 27, 2024

NLG: నేడు యాదాద్రికి గవర్నర్ రాక

image

 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తిరిగి 29న మరోసారి జిల్లాకు విచ్చేసి కొలనుపాక, స్వర్ణగిరి క్షేత్రాలను సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం రాజ్‍భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా కొండపైకి ఏడు గంటలకు చేరుకుంటారు. 

News August 27, 2024

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ.5 వేల కోట్లు : డిప్యూటీ సీఎ భట్టి

image

తమ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు తొలి ఏడాదే ఐదు వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కు కేవలం ఏడాదికి రూ.3 కోట్లు మాత్రమే మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేసిందని, ఈ ఏడాది 3 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందన్నారు.