Telangana

News July 9, 2024

ఖమ్మం జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్  

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాకు చెందిన కిన్నెరసాని, ఖమ్మం జిల్లాకు చెందిన కనకగిరి అటవీ ప్రాంతాలను చేర్చారు. కిన్నెరసాని అభయారణ్యానికి పెట్టింది పేరు. 635చ.కి.మీ.లో ఇది విస్తరించింది. కనకగిరి రిజర్వు ఫారెస్ట్ 20,923హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. పాల్వంచలో త్వరలోనే సఫారీ, ట్రెక్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.

News July 9, 2024

రేపు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు రఘునాథపాలెం మండలం వీ.వెంకటాయపాలెంలోని కలెక్టరేట్‌లో రైతు భరోసాపై జిల్లా స్థాయి వర్క్ షాప్‌కు హాజరవనున్నారని తెలిపారు.

News July 9, 2024

కార్పొరేషన్ ఛైర్మన్‌గా మంచిర్యాల జిల్లా వాసి

image

విద్యార్థి దశ నుంచే ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దండేపల్లి మండలం అల్లీపూర్‌కు చెందిన ఆదివాసీ నేత కొట్నాక తిరుపతికి రాష్ట్ర స్థాయి పదవి వరించింది. గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తిరుపతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News July 9, 2024

PUలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్

image

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించగా ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.3.25 కోట్లతో కేజీబీవీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.

News July 9, 2024

యాదాద్రి: కలెక్టరేట్ ముందు VRAల నిరసన

image

VRAలను విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తంచేశారు. GO 81 ప్రకారం 60 ఏళ్లలోపు వారిని 61ఏళ్లు నిండిన ఉద్యోగుల వారసులను విధులలోకి తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. VRAలను గత ప్రభుత్వం 81వ GO ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20,555 VRAలు ఉంటే 16,758 మందిని విధుల్లోకి తీసుకుంది. మిగతా 3,797మందిని ఎలక్షన్ల తర్వాత తీసుకుంటామని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు.

News July 9, 2024

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌పై సీఎం కీలక ఆదేశాలు

image

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. MBNR కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షించారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News July 9, 2024

ఖమ్మం: జిల్లాలో సాగర్ కాలువలపై చోరీల కలకలం?

image

నాగార్జున సాగర్ ప్రధాన కాలువలపై ఉండే క్రాస్ రెగ్యులేటర్ల వద్ద షట్టర్లు ఎత్తేందుకు, దింపేందుకు ఉపయోగించే ఇత్తడి చక్రాలు చోరీకి గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలు, తనికెళ్ల, ఏన్కూరు, కల్లూరు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అంతటా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి.

News July 9, 2024

విదేశీ స్కాలర్ షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో చదువుకునే వారు స్కాలర్షిప్ పొందేందుకు అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి టి.విజేందర్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సు అభ్యసిస్తూ ఉపకార వేతనం పొందవచ్చన్నారు. telangana epass.cgg.gov.inలో దరఖాస్తు తీసుకోవాలని సూచించారు.

News July 9, 2024

ఖమ్మం: TGSRTC ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్‌తో RM సమావేశం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ అన్ని డిపోల ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్‌తో ఈరోజు సమావేశం నిర్వహించారు. డిపోలో ఉన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. డిపోలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రీజనల్ మేనేజర్‌కుTGSRTC ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్ పూలబొకే అందజేశారు.

News July 9, 2024

సంగారెడ్డి: చట్నీలో ఎలుక ఘటనపై అదనపు కలెక్టర్ ఫైర్

image

సంగారెడ్డి జిల్లాలోని జేఎన్టీయూలో చట్నీలో ఎలుక ఘటనపై అదనపు కలెక్టర్ మాధురి స్పందించారు. క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆమె కిచెన్‌లో అపరిశుభ్రంగా ఉంటడంతో ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. విద్యార్థులే కావాలని చట్నీలో ఎలుకను వేశారని ప్రిన్సిపల్ చెప్పగా తినే ఆహారంలో ఎందుకు వేస్తారని అదనపు కలెక్టర్ నిలదీశారు