India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్రేటర్ HYD నగరంలో వివిధ పన్నులకు సంబంధించి పూర్తి డిజిటలైజేషన్ దిశగా GHMC అడుగులు వేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపునకు నగదును స్వీకరించమని గతంలోనే కమిషనర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిబంధన అమల్లోకి వచ్చాయి. యూపీఐ, క్యూఆర్ కోడ్, క్రెడిట్ ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేయాల్సి ఉంది. దీని ద్వారా అక్రమ వసూళ్లకు తెరపడనుంది.

HYDలో తాగు, మురుగు నీటి అక్రమ కనెక్షన్లకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో నూతన యాప్ ద్వారా ఇన్‌స్పెక్షన్ మొదలుపెట్టారు. ఆయా ప్రాంతానికి వెళ్లి యాప్‌లో చెక్ చేస్తే అనుమతి పొందిన కనెక్షన్ల వివరాలు చూపిస్తుంది. యాప్‌లో చూపించని కనెక్షన్లు అక్రమం అని తేలిపోనుంది. అక్రమ కనెక్షన్ల ద్వారా జలమండలికి తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

HYD ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కోటా కింద జులై 8 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్ క్వార్టర్స్, tuskercrc-202@gov.in, www.joinindianarmy@nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

HYDలో తాగు, మురుగు నీటి అక్రమ కనెక్షన్లకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో నూతన యాప్ ద్వారా ఇన్‌స్పెక్షన్ మొదలుపెట్టారు. ఆయా ప్రాంతానికి వెళ్లి యాప్‌లో చెక్ చేస్తే అనుమతి పొందిన కనెక్షన్ల వివరాలు చూపిస్తుంది. యాప్‌లో చూపించని కనెక్షన్లు అక్రమం అని తేలిపోనుంది. అక్రమ కనెక్షన్ల ద్వారా జలమండలికి తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

HYD ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కోటా కింద జులై 8 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసీ సెంటర్ హెడ్ క్వార్టర్స్, tuskercrc-202 @gov.in, www.joinindianarmy@nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్‌కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న HMDA అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.

HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్‌కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.

రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేశవరావుతో కాంగ్రెస్ రాజీనామా చేయించిందని, మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన MLA, MLCలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

పోలీస్ సిబ్బంది నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గద్వాల ఎస్పీ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నేర, న్యాయచట్టాలు 2023 ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించేందుకు నూతన చట్టాల ద్వారా అవకాశం కలిగిందన్నారు. ఇకపై నూతన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు

ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో TSP జేఏసీ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TSP జేఏసీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TSP జేఏసీ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ నాయకులు నవీన్, వేదంత్ మౌర్య, లవకుమార్, అభిమన్యు, రవి, ప్రవీణ్, ప్రసాద్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.