India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ శాఖ అధికారి సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 24 వరకు నిర్దేశించిన తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు ధ్రువీకరణ పత్రం కోసం దగ్గర్లోని మీసేవ సెంటర్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. క్యాంపుకు వచ్చే దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకున్న రసీదు, ఆధార్ కార్డు, మెడికల్ రిపోర్ట్, పాస్ ఫొటో తీసుకురావాలన్నారు.

పిట్లంలోని మారేడ్ చెరువులో పడి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. SI నీరేష్ వివరాలిలా.. పిట్లం వాసి చిలుక అంజవ్వకు (41) ఇవాళ తన అత్త మానేవ్వతో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైనా అంజవ్వ క్షణికావేశంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంతాలపల్లి మండలం చారి తండా శివారులో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంచిర్యాల జిల్లా చెన్నూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వద్ద ఉన్న పెట్రోల్ బంకు దగ్గర కారు బైక్ కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు వారు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని MBNR జిల్లాకలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. డ్రైడే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీలలో పర్యటించి ఆమె పరిశీలించారు. చెత్త, చెదారం రోడ్లపై, డ్రైనేజీలలో వేయరాదని కాలనీవాసులకు సూచించారు. మురుగునీరు ప్రవహించేలా డ్రైనేజీలను శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

నల్గొండ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు బాగుండడం పట్ల కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేద వీర్ ఆర్య సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పనుల పరిశీలన నిమిత్తం మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ బృందం శాస్త్రవేత్త దివాకర్ మహంతాతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి. నారాయణరెడ్డితో సమావేశమయ్యారు.

రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ శాఖ అధికారి సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

హుస్నాబాద్ ప్రాంతం టూరిజం స్పాట్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ మేరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ దేవాలయం, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం, రాయికల్ జలపాతం, సర్వాయిపేట, వంగర, కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్షకాలం ప్రారంభమై నెల రోజులవుతున్నా ఉమ్మడి జిల్లాలో వర్షాలు సరిగ్గా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లలో నీళ్లు పెద్దగా రావట్లేదని ఈసీజన్లో 5.20లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరి 3,13,965 ఎకరాలు, సోయా 85,444ఎకరాలు, మక్క 57,315ఎకరాలు, పత్తి 28,730ఎకరాలు, కంది 13,961ఎకరాలు, పెసర 4,997ఎకరాలు, మినుము 5,263ఎకరాల్లో పండిస్తున్నారు. ఇప్పటికి 40శాతం పంటలు సాగయ్యాయి.
Sorry, no posts matched your criteria.