India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని రాష్ట్ర ప్రజలు శుభసూచకంగా చూస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల వలె విభజన హామీల పరిష్కారం కాని అంశాల పరిష్కారం కోసం చర్చ జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ అర్ధం అవుతుందన్నారు.

సింగపూర్‌లో తెలుగు యువకుడు మృతి చెందాడు. వివరాలిలా. కోదాడకి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పవన్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిత్వాలను చంపేసుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన మండిపడ్డారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హన్మకొండ నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన, కాకతీయుల కళాకట్టడమైన వేయిస్తంభాల దేవాలయంలో ఈరోజు రుద్రేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. నేడు ఆషాఢ మాసం మొదటిరోజు కావటంతో స్వామికి సహస్ర జిల్లేడు పూలతో అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామికి విశేష పూజలు నిర్వహించి, భక్తుల సమక్షంలో హారతి ఇచ్చారు.

భద్రాచలంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాదిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి సబ్ జైలుకు తరలించారు. కొంతకాలం క్రితం ఓ మహిళ తన కుటుంబ వివాద పరిష్కారం కోసం కృష్ణ ప్రసాద్ అనే న్యాయవాదిని సంప్రదించింది. ఈ క్రమంలో అతను మహిళకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. న్యాయవాదిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హేమచంద్రాపురం రైల్వేగేట్ సమీపంలో చోటుచేసుకుంది. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్ వెళ్తున్న ఓ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి, ఆత్మహత్య చేసుకున్నాడని లోకో పైలట్ ద్వారా రైల్వే పోలీసులు తెలుసుకున్నారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు.

సిరిసిల్ల జిల్లాలో ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని ,సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవద్దని తెలిపారు.

పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని దొంగిలించి అందులో ఉన్న నగదు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో జరిగింది. 161 జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ దేవాలయంలో పలుమార్లు దొంగతనాలు జరుగుతున్నాయి. 3సార్లు దొంగతనాలు జరిగినట్లుగా స్థానికులు తెలిపారు.

డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేశవరావును రాష్ట్ర ప్రజా సంబంధాల సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల బిఆర్ఎస్ నుండి కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Sorry, no posts matched your criteria.