India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల నియోజకవర్గ ఇరిగేషన్ అభివృద్ధిపై చర్చించారు. ఇరిగేషన్ పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని MLC కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి తెలిపారు.

ఇటీవల విడుదలైన గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాల్లో ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి 36 మంది అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించి మెయిన్స్‌కి ఎంపికైనట్లు స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఈ విజయానికి కారణం అత్యుత్తమ అధ్యాపక బృందం, రాష్ట్ర డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా షెడ్యూల్ అభివృద్ధి అధికారి సునీత ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధించామని ఆయన పేర్కొన్నారు.

కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ఐఆర్ సీటీ దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర ప్యాకేజ్ టూర్‌ను ప్రవేశ పెట్టినట్లు యాత్ర ఇన్చార్జ్ కొక్కుల ప్రశాంత్ తెలిపారు. యాత్ర ఆగస్టు 4న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై అదే నెల 12 వరకు సాగుతుందని తెలిపారు. యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 పగలు ఉంటుందన్నారు. ఈ యాత్ర ప్రత్యేక రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, మీదుగా సాగుతుందని తెలిపారు.

కేసముద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని సిబ్బంది ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 9వ తరగతి చదువుతున్న ఆమె.. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. తిరిగి బుధవారం హాస్టల్లో చేరగా.. సా.5గం. ప్రాంతంలో గురుకులంలోని ఒకటో అంతస్తు పైనుంచి కిందపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మధిర: ఆషాఢ బోనాలు సందర్భంగా ప్రజా భవన్ నుంచి డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్క సంప్రదాయంగా బోనాలు తయారు చేశారు. అనంతరం బోనాలను ఎత్తుకొని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. అదేవిధంగా ఎల్లమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.

పంచాయతీల్లో బదిలీలు చేసేందుకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. ఒకేచోట నాలుగేళ్ల నిండిన వారందిరికి ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడున్న మండలం కాకుండా వేరేచోటుకు మార్చాలని ఆదేశాలు రావటంతో అధికారులు జాబితా తయారు చేస్తున్నారు. జిల్లాలో 530 పంచాయతీలు ఉన్నాయి. 464 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా అందులో 150 మందికి, ఎంపీవోలు 18, సిబ్బంది 25 మంది బదిలీలకు అవకాశం ఉంది.

సిరిసిల్ల జిల్లాలో డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్(దేశీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. దేశీలో 80 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జిల్లాలోని ఎరువుల విక్రయ, క్రిమిసంహారక లై సెన్స్, పదో తరగతి చదివిన డీలర్లు అర్హులుగా పేర్కొన్నారు.

మధిర మండలం మడుపల్లి గ్రామంలో నిన్న రోడ్డు పక్కకు ఓ <<13600268>>కారు <<>>దూసుకెళ్లి డ్రైవర్‌కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడ్డ కారు డ్రైవర్ రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రమేశ్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రైతుల ఆలోచనే ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని అన్నారు.

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. 16.17 టీఎంసీ నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజీకి మంగళవారం ఇన్ఫో 35,200 క్యూసెక్కులు రాగా.. బుధవారం 41,500 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రవాహం 89.90 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.