Telangana

News August 27, 2024

MDK: విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్: అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకంలో భాగంగా జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. వార్షికోత్సవం 5లక్షల లోపు ఉండి డిగ్రీ, ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులు రావాలన్నారు. www.telanganaepass.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 27, 2024

KNR: ఆ గ్రామంలో ఆదివారం నాన్ వెజ్ బంద్!

image

సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా.. చాలా మందికి ఆదివారం మాత్రం నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామస్తులు కాస్త భిన్నంగా ఉంటారు. ప్రతి ఆదివారం కేవలం శాఖాహార భోజనం మాత్రమే తింటారు. మద్యానికి దూరంగా ఉంటారు. మల్లన్నస్వామి ప్రీతికరమైన ఆదివారం మాత్రం నిష్టతో ఉంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు.

News August 27, 2024

కరీంనగర్: ముస్తాబవుతున్న బొజ్జ గణపతి విగ్రహాలు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి కోసం నెలరోజుల ముందునుంచే మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను మండపంలోనే తయారు చేస్తున్నారు. రామ్ నగర్ లో ఏర్పాటు చేస్తున్న మండపాన్ని మిత్ర యూత్ అత్ ముప్పై ఒక్క అడుగుల బొజ్జ గణపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలను అమర్చి చూపరులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

News August 27, 2024

WGL: విషజ్వరాల నియంత్రణకు చర్యలు

image

ఉమ్మడి WGL జిల్లాలో రోజురోజుకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులను సమన్వయపరుస్తూ డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మురళీధరన్ తెలిపిన ప్రకారం.. 330కి పైగా డెంగీలు నమోదైనట్లు, వైద్య శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటా సర్వే చేపట్టి జ్వర లక్షణాలు ఉన్నవారికి మందులను ఇస్తున్నారు.

News August 27, 2024

హైదరాబాద్‌కు డెంగ్యూ ఫీవర్

image

HYDలో ‘డెంగ్యూ’ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 404 కాలనీల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 నుంచి 15 వరకు 10 రోజుల్లో GHMC, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. 731 మందికి డెంగ్యూ, ఒకరికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే, 378 మందికి మాత్రమే డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బల్దియా లెక్కలు చెప్పడం గమనార్హం. పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీ కేర్ ఫుల్
SHARE IT

News August 27, 2024

MDK: విజృంభిస్తోన్న విష జ్వరాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే డెంగ్యూతో ముగ్గురు మృతిచెందారు. 2 నెలల్లో ఇప్పటివరకు సంగారెడ్డిలో 186, మెదక్‌లో 26, సిద్దిపేటలో 56 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గ్రామాలు, తండాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. BE CAREFULL
SHARE IT

News August 27, 2024

అడవుల జిల్లాలో.. అందమైన దృశ్యం

image

అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్ధమైన అందాలకు, ప్రకృతి రమణీయతకు కొదవలేదు. వర్ష కాలంలో ఆకుపచ్చని చీరను చుట్టినట్లు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దట్టమైన అడవితో అందాలు కనువిందు చేస్తాయి. ఆకుపచ్చని దట్టమైన చెట్ల మధ్యలో నుంచి నల్లటి తారురోడ్డు ఆదిలాబాద్ మీదుగా వెళ్లే 44 జాతీయ రహదారి విహంగ దృశ్యం కనువిందు చేస్తోంది.

News August 27, 2024

హైదరాబాద్‌కు డెంగ్యూ ఫీవర్

image

HYDలో ‘డెంగ్యూ’ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 404 కాలనీల్లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 నుంచి 15 వరకు 10 రోజుల్లో GHMC, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. 731 మందికి డెంగ్యూ, ఒకరికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే, 378 మందికి మాత్రమే డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బల్దియా లెక్కలు చెప్పడం గమనార్హం. పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీ కేర్ ఫుల్
SHARE IT

News August 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,313 టన్నుల యూరియా దిగుమతి

image

ఖమ్మంకు రైల్వే వ్యాగన్ల ద్వారా సోమవారం
1,313 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయింది. ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన ఈ యూరియాను ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదాంలకు ఇక్కడ నుంచి లారీల్లో పంపించారు. భద్రాద్రి జిల్లాకు 700 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లాకు 313, మహబూబాబాద్ జిల్లాకు 300 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా పంపించామని అధికారులు తెలిపారు.

News August 27, 2024

ఆదిలాబాద్‌లో నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్‌ను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏజెన్సీలోని గిరిజనుల సమస్యల పరిష్కరణ, ఐటీడీఎలోని బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై బంద్ నిర్వహిస్తున్నామన్నారు. దీంతో అన్ని సంఘాల నాయకులు, వ్యాపారస్తులు సహకరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ విద్యార్థి సంఘం, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు.