Telangana

News March 21, 2024

KTDM: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం

image

పదో తరగతి విద్యార్థినిపై అదే తరగతికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సుజాతనగర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసు వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, బాలుడు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. బాలికపై ఆ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

News March 21, 2024

కామారెడ్డి: ఎన్నికల కోడ్.. రూ.1.20 లక్షలు పట్టివేత..

image

నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.లక్ష 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో HYD నుంచి జాల్నాకు వెళ్తున్న ఓ కారులో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI సుధాకర్ పేర్కొన్నారు.

News March 21, 2024

HYD: గ్రీన్ ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు FREE

image

హైదరాబాద్‌లో 23 గ్రీన్‌ ఎలక్ట్రిక్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రోడ్డెక్కాయి.
బస్సులు తిరిగే రూట్‌లు, బస్సుల సంఖ్య:
*సికింద్రాబాద్-మణికొండ రూట్‌‌: 12
*పటాన్‌చెరు-CBS రూట్‌‌: 6
*పటాన్‌చెరు-కోఠి రూట్‌: 5
ప్రతి 10, 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.
SHARE IT

News March 21, 2024

హుస్నాబాద్‌: యువకుడి సూసైడ్

image

హుస్నాబాద్‌కి చెందిన రుద్రయ్య(20) కరీంనగర్ జిల్లా‌లో పనికి వెళ్లాడు. ఈక్రమంలో ఓ యువతిని గత నెల 2న పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రుద్రయ్య ఇంటికి వెళ్లి మేజర్ అయ్యే వరకు దూరంగా ఉండాలంటూ యువతిని తీసుకువెళ్లారు. అనంతరం ఫొటోలను డిలీట్ చేయాలంటూ బెదిరించడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 21, 2024

HYD: గ్రీన్ ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు FREE

image

హైదరాబాద్‌లో 23 గ్రీన్‌ ఎలక్ట్రిక్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రోడ్డెక్కాయి.
బస్సులు తిరిగే రూట్‌లు, బస్సుల సంఖ్య:
*సికింద్రాబాద్-మణికొండ రూట్‌‌: 12
*పటాన్‌చెరు-CBS రూట్‌‌: 6
*పటాన్‌చెరు-కోఠి రూట్‌: 5
ప్రతి 10, 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.
SHARE IT

News March 21, 2024

రెండు రోజుల్లో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

రెండు రోజుల్లో వరంగల్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించగా.. కాంగ్రెస్, BJP పెండింగ్‌లో ఉంచాయి. అయితే BJP అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బరిలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News March 21, 2024

మంచిర్యాల: BRSకు మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాక్

image

మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బాల్కసుమన్‌తో విభేదాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి BRS టికెట్టు రాకపోవటంతో ఆయన BRS కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు రాలేదని పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడటం చెన్నూర్‌కి తీరని లోటని స్థానికులు భావిస్తున్నారు.

News March 21, 2024

కరీంనగర్: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

image

బైకు చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్సై సురేందర్‌ కథనం ప్రకారం.. గోపాల్‌రావుపేటకు చెందిన అరవింద్‌తో కలిసి రాకేశ్‌(21) మంగళవారం రాత్రి తన బావ బర్త్‌డే వేడుకలు జరుపుకొన్నారు. అక్కడి నుంచి చొప్పదండిలో భోజనం చేసేందుకు ఇద్దరు బైకుపై లక్ష్మీపూర్‌ మీదుగా బయలుదేరారు. వెంకట్రావుపల్లి శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. క్షతగాత్రులను KNR ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే రాకేశ్‌ మృతి చెందాడు.

News March 21, 2024

NLG: అష్టకష్టాలు పడుతున్న పండ్లతోటల రైతులు

image

బోర్లలో నీరు అడుగంటడంతో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పండ్ల తోటలను రక్షించుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే బత్తాయి సుమారు 60 వేల ఎకరాల్లో, నిమ్మ 20 వేల ఎకరాల్లో ఉన్నాయి. రూ. లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో తోటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

News March 21, 2024

హైదరాబాద్‌లో పార్కింగ్‌పై స్పెషల్ ఫోకస్

image

నగరంలో ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని పూర్తి ప్రణాళికను తయారు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలపై చర్చించారు. కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు.

error: Content is protected !!