Telangana

News July 12, 2024

ఖమ్మంలో బయటపడ్డ ఏఆర్ కానిస్టేబుల్ రాసలీలలు..!

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు రాసలీలలు బయటపడ్డాయి. ఏడాది క్రితం కోర్టు విషయంలో త్రివేణి అనే మహిళ కానిస్టేబుల్‌కు పరిచమైంది. చెల్లి అంటూ సదరు మహిళతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల త్రివేణిపై అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో త్రివేణి భర్త పోలీసులను ఆశ్రయించారు. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు.

News July 12, 2024

NZB: ఆందోళన కలిగిస్తోన్న కుక్కల బెడద

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డ వారి సంఖ్య ఆందోళన గలిగిస్తోంది. 2023 డిసెంబరులో నిజామాబాద్ జిల్లాలో382 కుక్క కాటు కేసులు నమోదు కాగా కామారెడ్డి జిల్లలో 56 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో NZBలో 376, KMRలో 32, ఫిబ్రవరిలో NZBలో 326, KMRలో 44, మార్చిలో NZBలో 326, KMRలో 38, ఏప్రిల్ లో NZBలో 335, KMRలో 40, మే నెలలో NZBలో 243, KMRలో 28 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.

News July 12, 2024

పాలమూరు యువకుడికి ప్రధాని మోదీ లేఖ

image

ప్రధాన మంత్రి మోదీ యువకుడిని ప్రశంసిస్తూ లేఖను పంపించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NRPTలో నిర్వహించిన బహిరంగ సభలో అంత్వార్‌కు చెందిన శివ తాను గీసిన శివాజీ మహారాజ్, ప్రధాని మోదీ ఉన్న చిత్రపటాన్ని ప్రదర్శించాడు. చిత్రపటాన్ని PM తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా స్వీకరించారు. దీంతో అభినందిస్తూ ఢిల్లీ నుంచి ప్రశంస పత్రాన్ని పంపించారు. యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు.

News July 12, 2024

సిరిసిల్ల: భయపెడుతున్న డెంగ్యూ!

image

ఉమ్మడి KNR వ్యప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి(M)లో డెంగ్యూ కేసు నమోదైంది. ఈ  ఏడాది మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్నవారి సంఖ్య లెక్కలోకి రావట్లేదు. జిల్లాలో 17 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 6 ప్రాంతాలను డెంగ్యూ హైరిస్క్‌ ప్రాంతాలుగా వైద్యాధికారులు గుర్తించారు.

News July 12, 2024

ముత్తు పదార్థాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్: సీపీ

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రై సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, వినియోగం జరిగే ప్రాంతాల వివరాలను పోలీస్ కమిషనర్ ఏసీపీలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వరంగల్‌లో గంజాయికి సంబంధించి నమోదయిన కేసుల వివరాలను ఆరా తీశారు. డ్రగ్స్ పై కఠినంగా ఉండాలన్నారు.

News July 12, 2024

‘అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

image

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల ప్రగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శపాఠశాల పనులు సకాలంలో ముగించాలన్నారు. కార్యక్రమములో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

News July 12, 2024

‘వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టండి’

image

 గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని MHBD జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ,  అమ్మ ఆదర్శ పాఠశాలలు తదితర అంశాలపై సంబధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.

News July 12, 2024

‘జనాభా నియంత్రణపై ఫోకస్ పెట్టాలి’

image

ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని DMHO కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆరోగ్య కార్యకర్తలకు హనుమకొండ DMHO డా.సాంబశివరావు పలు సూచనలు చేశారు. జనాభాను అరికట్టేందుకు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన వ్యాసెక్టమీ లేదా ట్యూబెక్టమీ ఆపరేషన్లు మాత్రమే కాకుండా, కాన్పుల మధ్య అంతరం కోసం తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆరోగ్య కార్యకర్తలపై ఉందన్నారు.

News July 12, 2024

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిని నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B, నేషనల్ హైవే, RWS, EWIDC, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. 

News July 12, 2024

MBNR: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్

image

CM రేవంత్ రెడ్డిని గద్వాల కాంగ్రెస్ ఇంచార్జి సరిత తిరుపతయ్య గురువారం సచివాలయంలో MP మల్లురవితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ సీఎంకు సరిత వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ లో ఉన్న పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రాజెక్టులకై ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు. గట్టు కృష్ణమూర్తి, శ్రీధర్ పాల్గొన్నారు.