Telangana

News March 20, 2024

కొత్తగూడెం: ఆన్సర్ షీట్లకు బదులు అడిషనల్ షీట్స్ 

image

 ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పాల్వంచలోని KTPS పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్ష జరిగింది. విద్యార్థులకు ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్స్‌కి బదులు అడిషనల్ షీట్స్ ఇచ్చారు. విద్యార్థులు అందులోనే జవాబులు రాశారు. మరుసటి రోజు హిందీ పరీక్ష రాశాక జరిగిన తప్పును గ్రహించి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని ఎంఈవో రామ్మూర్తి చెప్పారు. 

News March 20, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔పకడ్బందీగా ఎన్నికల కోడ్..పలుచోట్ల తనిఖీలు
✔పోలింగ్ కేంద్రాలపై అధికారుల దృష్టి
✔GDWL:పలు మండలాలలో కరెంట్ కట్
✔MBNR:నేడు కాంగ్రెస్ లో చేరనున్న జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ,పలు నేతలు
✔పలు నియోజక వర్గాల్లో స్థానిక MLAల పర్యటన
✔రంజాన్ వేళలు:
ఇఫ్తార్(బుధ):6:35,సహార్(గురు)-5:00
✔ఓటు హక్కు పై పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔త్రాగునీటిపై హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు
✔ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా

News March 20, 2024

గోదావరిఖనిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

కుటుంబ వివాదంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన GDKలో జరిగింది. వన్ టౌన్ SI రవీందర్ వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి షెహజాద్.. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్షలో ఉన్నాడు. అయితే యువకుడు ఆహారం తీసుకున్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News March 20, 2024

HYD: కుక్కల బెడద.. నియంత్రణ ఎక్కడ..?

image

HYD, RR, MDCL పరిధిలో కుక్కల బెడదతో గల్లీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబర్‌పేట, షేక్‌పేట, రాజేంద్రనగర్, అద్రాస్‌పల్లి, ఉప్పల్ లాంటి అనేక చోట్ల కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. ఇప్పటికీ ఎల్బీనగర్-24385, చార్మినార్-37666, ఖైరతాబాద్-8178, శేర్లింగంపల్లి-1813, కూకట్‌పల్లి-6901, సికింద్రాబాద్‌లో 18086 కుక్కలకు స్టెరిలైజేషన్ కాలేదు. ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News March 20, 2024

MBNR: ఐదుగురిలో మిగిలేది ఒక్కరే!

image

ఉమ్మడి పాలమూరులో ఉన్న ఐదుగురు జిల్లా పరిషత్ ఛైర్మన్లలో BRS పార్టీకి ఇక ఒక్కరే మిగలనున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పటికే ముగ్గురు పార్టీలు మారగా, MBNR జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి నేడు BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శాంత కుమారి ఒక్కరే BRS తమకు పదవులు ఇచ్చిందని, పార్టీ మారే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేశారు.

News March 20, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,550 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News March 20, 2024

నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో ఎంఎస్, పీహెచ్ఏ కోర్సులు చదివేందుకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం ప్రకటన జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. www.nosmsje.gov.in అనే వెబ్‌పోర్టల్‌లో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవావాలని పేర్కొన్నారు.

News March 20, 2024

మెదక్: పోలీసులమంటూ తనిఖీ.. బెదిరించి బంగారం అపహరణ

image

పోలీసులమంటూ బెదిరించి బంగారు అపహరించిన ఘటన సంగారెడ్డి మండలం చక్రియాలలో జరిగింది. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు బైకుపై సంగారెడ్డి నుంచి చక్రియాల వెళ్తుండగా MNR వద్ద నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ ఆపారు. కత్తితో బెదిరించి వారి వద్దనున్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 20, 2024

ఆదిలాబాద్: ప్రాణం తీసిని చేపల వేట

image

ఆదిలాబాద్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన మత్స్యకారుడు రాజన్న(46) మంగళవారం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో మునిగాడు. గమనించిన జాలరులు బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News March 20, 2024

SRPT: కుక్కల దాడిలో 32 గొర్రెలు మృతి

image

తిరుమలగిరి మండలం వెలిశాలలో గొర్ల మందపై కుక్కలు దాడి చేసిన ఘటన ఈ తెల్లవారు జామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లంల సమ్మయ్య దొడ్డిలో ఉన్న 32 గొర్లపై కుక్కలు దాడి చేసి చంపినట్లు సమ్మయ్య వాపోయారు. వాటి విలువ సుమారు రూ.2,50,000 విలువ ఉంటుందని, రైతు అవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతున్నాడు.

error: Content is protected !!