India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✒MBNRలో సమీక్షలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉమ్మడి జిల్లా MLAలు
✒త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం రేవంత్
✒మక్తల్: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు
✒గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యా: సినీనటి మంచు లక్ష్మి
✒పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన సీఎం
✒ఫీజుల దోపిడీని అరికట్టాలి:PDSU
✒ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ వేడుకలు
✒పలుచోట్ల వర్షాలు
✒రోడ్డు ప్రమాదాలపై అవగాహన

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని అంధుల పాఠశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. గదిలో మెడకు తాడు చుట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించిన యువకుడి మృతదేహం. పాఠశాల వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం ఆమె రాష్ట్ర, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. వనపర్తి జిల్లా దగడలో 58.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు 48.0 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 46.0 మి.మీ, జడ్చర్లలో 43.0 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

షాద్‌నగర్ పట్టణంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్జాతీయ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 30న అయ్యప్ప కాలనీలో నివాసముండే గాదం రమేష్ ఇంట్లో పాచి పనికి నేపాల్‌కు చెందిన ప్రసన్న బాదువాల్ వచ్చింది. ఆమె భర్త ప్రశాంత్ బదువాల్‌తో కలిసి రమేశ్ ఇంట్లో 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మంగళవారం భారీగా గుట్కాను పట్టుకున్నారు. నగరంలోని మార్కెట్లోని వెల్కమ్ ఏజెన్సీ సంబంధించిన అబ్దుల్ బాసిత్ గోడౌన్‌లో రూ.4,26,873 గుట్కాను పట్టుకున్నట్లు SHO విజయ్ బాబు తెలిపారు. దాంతో పాటు ఈరోజు ఉదయం డిచ్పల్లిలోని మెంట్రాజ్‌పల్లి సమీపంలో డీసీఎంలో తరలిస్తున్న రూ.39లక్షల విలువైన గుట్కాను ఎస్ఐ మహేశ్ స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానిక సాయినగర్ సాయిబాబా ఆలయం ఎదుట బిక్షాటన చేసే వ్యక్తి మృతిచెందాడు. టూ టౌన్ పోలీసులు వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు ఎరుపు రంగు డబ్బాల షర్ట్, జీన్ పాయింట్ వేసుకున్నాడు. అతడి వయసు 50 నుంచి 55 ఉండొచ్చిన తెలిపారు. సమాచారం తెలిసిన వారు తమని సంప్రదించాలని వారు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.

తన కూతురు పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుట్ర పన్నుతున్నారని బానోతు లీలాబాయి ఆరోపించారు. మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..రఘునాథపాలెం మండలం రజ్జిబ్ అలీనగర్‌లో తనకు ఉన్న వ్యవసాయ భూమిని తన కూతురు లావణ్యకు పసుపు కుంకుమ కింద ఇచ్చానని వెల్లడించారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు స్థానిక వ్యక్తి చూస్తున్నాడన్నారు.

రామాయంపేట మండలం కోమటిపల్లి మోడల్ స్కూల్‌లో <<13593942>>ఫుడ్ పాయిజన్<<>> ఘటనపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ‘ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత’ అని Way2Newsలో వచ్చిన కథనంపై పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి స్పందించారు. ఈ ఘటనలో నలుగురిపై చర్యలు తీసుకున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు. వంట మనిషి, సహాయకులను వీధుల నుంచి తొలగిస్తూ, కేర్ టేకర్, హాస్టల్ ప్రత్యేక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.