Telangana

News August 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,313 టన్నుల యూరియా దిగుమతి

image

ఖమ్మంకు రైల్వే వ్యాగన్ల ద్వారా సోమవారం
1,313 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయింది. ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన ఈ యూరియాను ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదాంలకు ఇక్కడ నుంచి లారీల్లో పంపించారు. భద్రాద్రి జిల్లాకు 700 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లాకు 313, మహబూబాబాద్ జిల్లాకు 300 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా పంపించామని అధికారులు తెలిపారు.

News August 27, 2024

ఆదిలాబాద్‌లో నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్‌ను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏజెన్సీలోని గిరిజనుల సమస్యల పరిష్కరణ, ఐటీడీఎలోని బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై బంద్ నిర్వహిస్తున్నామన్నారు. దీంతో అన్ని సంఘాల నాయకులు, వ్యాపారస్తులు సహకరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ విద్యార్థి సంఘం, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు.

News August 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
> నేడు అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
>నేడు ముదిగొండలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు

News August 27, 2024

మహబూబ్‌నగర్: రైతుకు ‘భరోసా’ కరవు!

image

వానాకాలం పంటల సీజన్ మరో నెల రోజుల్లో ముగియనున్నా రైతుభరోసా కింద ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంటల సాగుకు పెట్టుబడి కరువై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో అసలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుతుందా లేదా అని ఎదురుచూస్తున్నారు.

News August 27, 2024

మదర్ డెయిరీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

NLG-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్యలో డైరెక్టర్ల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 30తో పదవీ కాలం ముగియనున్న 3 స్థానాలు, గతంలో వాయిదా పడిన మరో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. SEP 4న నామినేషన్ల స్వీకరణ, 5న నామినేషన్ల పరిశీలన, అర్హత సాధించిన నామినేషన్ల ప్రకటన, 6న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు.

News August 27, 2024

HYD: UPSC ప్రిలిమ్స్.. రాష్ట్రంలో RR జిల్లా టాప్!

image

UPSC ప్రిలిమ్స్ పరీక్షలో TG రాష్ట్రంలోనే గరిష్ఠంగా RR నుంచి 14 మంది, మేడ్చల్ నుంచి 11, HYD నుంచి ముగ్గురు, వికారాబాద్ నుంచి ఒకరు, మొత్తంగా 29 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన ఒక్కొకరికి ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట సోమవారం సీఎం రేవంత్ రెడ్డి రూ.లక్ష విలువ చేసే చెక్కులను అందజేశారు. మెయిన్స్ పరీక్షలో పాసై ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయితే మరో రూ.లక్ష అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

News August 27, 2024

HYD: UPSC ప్రిలిమ్స్.. రాష్ట్రంలో RR జిల్లా టాప్!

image

UPSC ప్రిలిమ్స్ పరీక్షలో TG రాష్ట్రంలోనే గరిష్ఠంగా RR నుంచి 14 మంది, మేడ్చల్ నుంచి 11, HYD నుంచి ముగ్గురు, వికారాబాద్ నుంచి ఒకరు, మొత్తంగా 29 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన ఒక్కొకరికి ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట సోమవారం సీఎం రేవంత్ రెడ్డి రూ.లక్ష విలువ చేసే చెక్కులను అందజేశారు. మెయిన్స్ పరీక్షలో పాసై ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయితే మరో రూ.లక్ష అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

News August 27, 2024

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ

image

హనుమకొండలో యాదవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు. అన్ని విషయాల్లో మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చన్నారు.

News August 27, 2024

జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి: మంత్రి

image

ములుగు జిల్లా మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి సీతక్క అన్నారు. మొదటిసారి ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లాకు కావాల్సిన అభివృద్ధి పనుల్లో వారి సహాయ సహకారాలు ఉండాలని ఆశిస్తున్నామని, జిల్లాకు మొదటిసారి వస్తున్న గవర్నర్‌కు ఘనంగా స్వాగతం పలకాలని సీతక్క పిలుపునిచ్చారు.

News August 27, 2024

భీమన్న ఆలయంలో మహా లింగార్చన పూజ

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాస 4వ సోమవారం సందర్భంగా సాయంత్రం భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు గావించారు. స్వామివార్లను రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు చేసి.. పరివార దేవతార్చన పూజలు సైతం చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.