Telangana

News July 7, 2024

ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

image

ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో TSP జేఏసీ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TSP జేఏసీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TSP జేఏసీ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ నాయకులు నవీన్, వేదంత్ మౌర్య, లవకుమార్, అభిమన్యు, రవి, ప్రవీణ్, ప్రసాద్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News July 7, 2024

సంగారెడ్డి : ఈనెల 8న ప్రజావాణి కార్యక్రమం

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం‌లో ఈ నెల 8న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి పరిష్కరిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News July 7, 2024

రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

image

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, జీపీ ప్రత్యేక అధికారులతో గ్రామాలలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. GP ఆవరణతో పాటు, ఇతర ప్రభుత్వ సంస్థలు, రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలన్నారు.

News July 7, 2024

ఆదిలాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు సూచన

image

ఆదిలాబాద్ నుండి హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి గుంటూరు ఒంగోలు సూపర్ లగ్జరీ, లహరి సర్వీసులకు ఒకేసారి పోనురాను టికెట్ బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10శాతం రాయితీ పొందవచ్చని RTC డిపో మేనేజర్ కల్పన తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం RTC ప్రయాణ ప్రాంగణంలో రిజర్వేషన్ కౌంటర్లో లేదా
www.tsrtconline.in బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని RTC లో సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం చేయాలని కోరారు.

News July 7, 2024

ఖమ్మం జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం:కలెక్టర్

image

ఖమ్మం: వర్షాలు మొదలవడంతో ప్లాంటేషన్ ఒక పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర ఆటవీ ముఖ్య సంరక్షణ అధికారిణి ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నందు వనమహోత్సవంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని.. ఈ లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.

News July 6, 2024

గ్రామీణ నిరుద్యోగులపై దృష్టి పెట్టండి: మంత్రి

image

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్ సమక్షంలో మంత్రులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉచితంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పారు.

News July 6, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

హైదరాబాద్‌ శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ PS పరిధిలో బైక్‌పై వెళుతున్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

ఏపీ సీఎంని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మక సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అనువైన సమావేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

News July 6, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

హైదరాబాద్‌ శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ PS పరిధిలో బైక్‌పై వెళుతున్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాలు
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
@ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే.
@ కాలేశ్వరంలో భక్తుల రద్దీ.
@ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ బీర్పూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ.